ఎక్కడ వర్షం పడితే ఇక్కడ గొడుగు  పట్టినట్లు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ఉంది పరిస్థితి.. గుజరాత్ రాష్ట్రంలో కి ట్రంప్ వస్తే ఆంధ్ర రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా అమరావతి రైతులు అయితే ఏకంగా ట్రంప్ ఫోటో పెట్టుకుని నిరసన తెలిపారు. ఇక టిడిపి నాయకులు అయితే అధికార పక్షంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం అందగా...  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందలేదు అన్న విషయం తెలిసిందే. 

 

 ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష టీడీపీ నేతలు అందరూ అధికార పార్టీపై విమర్శలు చేశారు. జగన్ మీద ఉన్న కేసుల కారణంగానే ట్రంప్  విందుకు ఆహ్వానం అందలేదని అదే చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే కేసీఆర్ కూడా పిలవకుండా చంద్రబాబు పిలిచేవారని... ఏకంగా మా నాయకుడు ట్రంపు ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా తీసుకువచ్చే వాడు అంటూ ఆంధ్ర రాజకీయాల్లోని టీడీపీ నేతలు అంటున్నారు... ఇక అటు వైసీపీ నేతలు కూడా దీనిపై కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. ఒకప్పుడు బారక్ ఒబామా వచ్చినప్పుడు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు కి ఆహ్వానం ఎందుకు అందలేదు అంటూ కౌంటర్ ఇస్తున్నారు అధికార పార్టీ నేతలు. 

 


 అయితే భారత్లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోదీతో భేటీ అయితే దేశ రక్షణ కోసం ఓ కీలక ఒప్పందం చేసుకుని వెళ్తే దాని కోసం ఆంధ్ర రాజకీయాల్లో  అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం పై రాజకీయ విశ్లేషకులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో వర్షం పడితే ఆంధ్రప్రదేశ్లో గొడుగు  పట్టిన చందంగా ఆంధ్రప్రదేశ్ నాయకుల తీరు  ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ట్రంప్ భారత పర్యటనకు వచ్చిన ఒక రాష్ట్రానికి ఏమీ చేయలేదు... కేవలం దేశ రక్షణ కోసం ఒప్పందాన్ని మాత్రమే చేసుకుని వెళ్ళిపోయారు అదికూడా ఒక బిజినెస్ మాన్ గా వచ్చారు వెళ్ళారు. కానీ దీనికోసం ఆంధ్రప్రదేశ్లో నాయకులు ఎందుకు అంతలా విమర్శలు చేసుకుంటూన్నారు అని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: