ఈ వారం రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాకు వచ్చారు.. రెండు రోజులు పర్యటించారు. ఆయన పర్యటన ఆసాంతం మీడియాలో హైలెట్ అయ్యింది. ఇక ఏపీలో సీఎం వైఎస్ జగన్ జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభంచారు. ఆ తర్వాత చంద్రబాబు విశాఖలో పర్యటన కోసం విఫల ప్రయత్నం చేశారు.

 

ఇక తన ఇండియా పర్యటన సందర్భంగా ట్రంప్ అనేక డైలాగులు వల్లించారు. ఇండియా గొప్పదనాన్ని పొగిడేశారు. నరేంద్ర మోడీ గట్టి లీడర్ అంటూ కితాబివ్వడమే కాదు.. ఇండియన్ల మనసు దోచేలా ప్రసంగించారు. ఇది అమెరికాకు భారత్ ఇస్తున్న గౌరవం అని ట్రంప్ వ్యాఖ్యానించారంటే ఆయన ఎంతగా ఆనందించింది అర్దం చేసుకోవచ్చు. ట్రంప్ భారతీయ సంస్కృతి గురించి కాని, గొప్ప భారతీయ ప్రముఖుల గురించి ,చివకికి క్రికెట్ ఆటగాళ్లు సచిన్ ,విరాట్ కోహ్లి ల గురించి , భారతీయ సినిమాల గురించి ప్రస్తావించిన తీరు అందరిని ఆకట్టుకుంది. అత్యంత కీలకమైన ఇస్లామీక్ ఉగ్రవాదం గురించి కూడా మాట్లాడారు. మోడీ కూడా అత్యధిక భాగం హిందీలో మాట్లాడినా చాలా చక్కగా మాట్లాడారు.

 

ఈ వారం బాగా పేలిన మరో డైలాగ్ ఏపీ సీఎం జగన్ ది. రాష్ట్ర అభివృద్ధి కోసం రాక్షసులతో పోరాడుతున్నారన్న డైలాగ్ బాగా పేలిందనే చెప్పాలి. ఇంటింటా చదువులు, అందరికి ఆరోగ్యం, అన్ని ప్రాంతాలకు నీళ్లు, రైతన్నలకు ఆనందం, ఉద్యోగాలు, ఉపాధి ఈ లక్ష్యాలు సాధనే..లక్ష్యంగా ప్రభుత్వాన్ని గొప్పగా నడిపేవిధంగా మీ బిడ్డను ఆశీర్వదించాలి. దేవుడి దయ చాలా కావాలి. ఎందుకంటే రాక్షసులతో యుద్ధం చేస్తున్నాను. ఏతప్పు చేయకపోయినా కూడా ఏదో జరిగిపోతున్నట్లు విపరీతమైన రాతలు, టీవీ చానల్స్‌ ఉన్నాయి. తాను ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నాం అన్నారు జగన్.

 

 

ఇక ప్రతిపక్షనేత చంద్రబాబు అయితే మూడు రాజధాను అంశానికి మద్దతు ఇవ్వలేదని గొడవ పడ్డారు. చివరకు విశాఖలో నన్ను కాల్చండి... ఎన్ని రోజులు అడ్డుకుంటారు... మిమ్మల్ని విడిచి పెట్టను.. అంటూ చంద్రబాబు రంకెలు వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: