గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో జగన్ నిర్ణయాలను సమర్థిస్తూ.. మూడు రాజధానుల ప్రతిపాదనను కూడా చిరంజీవి మెచ్చుకున్నారు. దీంతో చిరంజీవి పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని, ఆయన వైసీపీలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాకుండా వైసీపీ తరఫున ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కూడా డక్కబోతోందని ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు ఈ విషయంపై జగన్ స్పందించకపోవడంతో ఇదంతా నిజమని అందరూ భావిస్తూ వచ్చారు. ఒకవైపు చిరు తమ్ముడు పవన్ జనసేన పార్టీ పేరుతో జనాల్లో తిరుగుతుంటే.. చిరంజీవి జగన్ కు మద్దతు ఇవ్వడం ఏంటని కొంతమంది విమర్శించారు. ఇవన్నీ ఇలా ఉంటే చిరంజీవి పొలిటికల్ ఎంట్రీపై  ఆయన తమ్ముడు నాగబాబు క్లారిటీ ఇచ్చారు.

IHG


 చిరంజీవి అసలు రాజకీయాల్లోకి రారని, వైసీపీ తరఫున ఆయనకు రాజ్యసభ సభ్యత్వం వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ నాగబాబు మండిపడ్డారు. చిరంజీవికి అన్ని రాజకీయ పార్టీల నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయని, అన్ని పార్టీల్లోనూ చిరంజీవి అభిమానులు ఉన్నారని, ఆయన కోరుకుంటే ఏ పార్టీలోనైనా ఉన్నత స్థానం కట్ట బెడతారని, తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి రాజకీయ జీవితం త్యాగం చేశారు అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. అమరావతి ప్రాంత రైతులకు మద్దతుగా తాను పవన్ నిలబడ్డామని, చిరంజీవి రాజధానిపై తన అభిప్రాయం చెప్పి ఉండవచ్చు.. అయితే ఆ మాత్రం దానికి ఇంటిని ముట్టడిస్తామంటే ఊరుకుంటామా అంటూ అమరావతి జేఏసి నాయకులను ఉద్దేశించి నాగబాబు ప్రశ్నించారు.

IHG


 దయచేసి ఎవరి స్వార్థం కోసం చిరంజీవిని వివాదాల్లోకి లాగవద్దని, ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అంటూ నాగబాబు క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటే అందరిలాగే మౌనంగా ఉండేవారు తప్ప మూడు రాజధానులకు మద్దతిస్తాం అంటూ బహిరంగంగా ప్రకటించడం వెనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అలాగే చిరంజీవి జగన్ ను అదే పనిగా పొగడడం కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: