క‌రోనా వైర‌స్ సోకితే, ఇప్పటివరకు కేవ‌లం న్యూమోనియా వస్తుందనే జనాలకు తెలిసిన విషయం. ఇప్పుడొక షాకింగ్ విషయం బయట పడింది. కరోనా వలన కేంద్ర నాడీ వ్య‌వ‌స్థ కూడా దెబ్బ‌తినే ప్ర‌మాదం వున్నదని.. బీజింగ్‌కు చెందిన డిటాన్ హాస్పిట‌ల్ డాక్ట‌ర్లు తాజాగా ప్రపంచానికి హెచ్చరికలు జారీ చేసారు. క‌రోనా సోకిన ఓ 56 ఏళ్ల రోగి సెరిబ్రోస్పైన‌ల్ ఫ్లూయిడ్‌లో వైర‌స్ ఉన్న‌ట్లు గుర్తించారు. అయితే ఆ పేషెంట్‌కు ఎన్‌సెఫ‌లిటిస్(మెద‌డువాపు) ఉన్న‌ట్లు నిర్ధారించడం గమనార్హం.

 

IHG

 

దీని వ‌ల్ల కేంద్ర నాడీ వ్య‌వ‌స్థ‌కు కేంద్ర‌మైన‌ మెద‌డుకు వైర‌స్ సోకే ప్ర‌మాదం కూడా వున్నదని వారు ముందస్తు జాగ్రత్తలు సూచిస్తున్నారు. 2003లో సార్స్ ప్ర‌బ‌లిన‌ప్పుడు కూడా డిటాన్ హాస్పిట‌ల్ ఆ వైర‌స్‌పై రీసెర్చ్ చేసింది. క‌రోనా లేదా కోవిడ్‌19 వ‌ల్ల‌.. నాడీ వ్య‌వ‌స్థ కూడా దెబ్బ‌తింటుంద‌న్న విష‌యాన్ని చైనా మీడియా తొలిసారి వెల్లడించడం గమనార్హం.

 

అయితే అక్కడ సదరు పేషెంట్‌కు ఇన్‌చార్జ్‌గా ఉన్న డాక్ట‌ర్ లియూ జింగ్‌యాన్ కొన్ని ముఖ్యమైన  విష‌యాలు చెప్పారు. కరోనా సోకిన పేషెంట్లు ఎవ‌రైనా స్పృహ లేన‌ట్లుగా క‌నిపిస్తే, అలాంటి పేషెంట్ల నాడీ వ్య‌వ‌స్థ దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న సలహా చెప్పారు. క‌రోనా పేషెంట్ల‌పై సెరిబ్రోస్పైన‌ల్ ఫ్లూయిడ్ ప‌రీక్ష‌లు మ‌రింత చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని బీజింగ్ డాక్ట‌ర్లు అంటున్నారు. 

 

IHG

 

మనకి బాగా తెలుసు.. కోవిడ్‌19 ల‌క్ష‌ణాల్లో భయంకరమైన శ్వాస‌కోస ఇబ్బందులు, మ‌యోకార్డియ‌ల్ డ్యామేజ్‌, కిడ్నీ ఇంజూరీతో పాటు మ‌రికొన్ని అవ‌య‌వాలు కూడా ప్ర‌భావానికి లోన‌య్యే అవ‌కాశాలు 
మెండుగా ఉన్నాయని మనకి తెలుసు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం నాడీ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఇలాంటి నెర్వస్ రిలేటెడ్ ప్రాబ్లెమ్ తక్కువ మందికి వచ్చే అవకాశం ఉందని వారు సూచించడం ఇక్కడ కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: