చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అయితే ఇప్పటివరకు  అంటార్కిటికా తప్ప అన్ని ఖండాలకు దాదాపుగా ఈ వైరస్ విస్తరించింది. అయితే.. మొన్నటివరకు ఈ వైరస్ ప్రభావం చైనాలో ఉద్ధృతంగా ఉంది ఈ విషయం మనకు తెలిసిందే.. ఈ వైరస్ భారిన పడి 2వేలకు పైగా మంది మరణించారు. అయితే చైనా తర్వాత కరోనా ప్రభావం ఎక్కువగా ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాలో అధికంగా ఉంది. 

 

 

అయితే.. ఇటలీలో ఇప్పటి వరకు 107 మంది ఈ వైరస్ తో ప్రాణాలు కోల్పోయారట. ఇప్పటివరకు బాధితుల సంఖ్య 3,089కి చేరింది. దీంతో ఏప్రిల్ 3 వరకు జరగనున్న ప్రొఫెషనల్ ఫుట్‌ బాల్ మ్యాచ్‌ లు రద్దుచేస్తున్నట్టు ఇటలీ ప్రధాని గ్యూసెప్పే కొంటే వెల్లడించారు. క్రీడా కార్యక్రమాలకు ఎక్కువ జనాలు రావటంతో వైరస్ ప్రభావం ఎక్కువ ఉంటుందని., ఇలా చేయటం వల్ల వైరస్‌ ను కొంత మేరా నిరోధించవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

 

 

ఇదిలఉండగా అమెరికాలో కోవిడ్ క్రమ క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్‌ తో 11 మంది మృతిచెందారు. న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ నగరాల్లోనూ కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా., ఉత్తర కాలిఫోర్నియాలో తొలి కరోనా మరణం చోటుచేసుకుంది. దీంతో అక్కడ హెల్త్ ఎమర్జెన్సీని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ప్రకటించారు. వైరస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు జంతువుల నుంచి మనిషికి మాత్రమే కరోనా వైరస్ వస్తుందని నమ్ముతూ వస్తుండగా.. తాజాగా హంకాంగ్‌ లో ఓ కుక్కకు కరోనా వైరస్ సోకింది. దీంతో, వైరస్ మనుషుల నుంచి జంతువులకు సోకుతుందని అధికారులు పేర్కొన్నారు.

 

 

అసలు ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 95,481 మంది వైరస్ బారినపడగా.. 3,285 మంది మృతిచెందారు. అయితే.. చైనాలో బుధవారం మరో 31 మంది ప్రాణాలు కోల్పోగా, కొత్తగా 165 కేసులు నమోదయ్యాయి. కరోనా భయంతో 36 దేశాలు పర్యాటకులపై నిషేధం విధించాయి. ఇలా అయిన తమ దేశ ప్రజలను వైరస్ భారిన పడకుండా కాపాడుకోవచ్చునని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: