జగన్ పరిపాలన పైన, నిర్ణయాలపైన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా, ప్రజల్లో మాత్రం సానుకూలమైన స్పందన కనిపిస్తోంది. కేవలం జగన్ పరిపాలనపై ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, పథకాల అమలు తీరును పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పరిశీలిస్తూ, తమ తమ రాష్ట్రాల్లో వాటిని అమలు చేసే విధంగా కసరత్తు చేస్తున్నాయి. కేంద్ర అధికార పార్టీ బిజెపి కూడా జగన్ నిర్ణయాలను ఇప్పటికే సమర్థిస్తూ వస్తోంది. తాజాగా బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ జగన్ తీసుకున్న మూడు రాజధానుల  నిర్ణయానికి జై కొడుతున్నారు. తమ రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఆయన కసరత్తు ముమ్మరం చేశారు. 

IHG


70 అసెంబ్లీ సీట్లు ఉన్న ఉత్తరాఖండ్ చిన్న రాష్ట్రం. అక్కడే మూడు రాజధానుల ఏర్పాటు చేసేందుకు త్రివేంద్ర సింగ్ నిర్ణయించుకున్నారు. ఉత్తరాఖండ్ లో కూడా మూడు రాజధానుల ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. ఏపీలో మాదిరిగానే ఉత్తరాఖండ్ లో న్యాయ రాజధానిగా నైనిటాల్, పరిపాలన రాజధానిగా డెహ్రాడూన్, సమ్మర్ క్యాపిటల్ గా గైరెన్స్ ప్రాంతాలను ఎంపిక చేశారు. ఇప్పటికీ అక్కడ అసెంబ్లీ భవనాలు, ఇతర నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రస్తుత రాజధాని డెహ్రాడూన్ కు గ్రేహెన్స్ మధ్య దాదాపు 300 కిలోమీటర్ల దూరం ఉంది. దీంతో అక్కడి ప్రజలంతా తమకు ప్రత్యేక రాజధాని కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.


 ఈ మేరకు అక్కడ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం రాష్ట్రంలోనే కాకుండా, జగన్ నిర్ణయాలు చాలా రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ ముఖ్యమంత్రి యుడియారప్ప కర్ణాటక లో అధికార వికేంద్రీకరణ చేపట్టారు. దానికి సంబంధించిన బిల్లు అసెంబ్లీలో ఆమోదించు కున్నారు. దీనిలో భాగంగానే ఉత్తర కర్ణాటకలో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఇక జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ 5 రాజధానులు అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. వీటన్నిటినీ మించి పట్టణ అభివృద్ధి నిపుణులు కూడా వికేంద్రీకరణ మాత్రమే ఇప్పుడు ఆచరణ యోగ్యం అంటూ చెబుతున్నారు. 


భిన్నమైన ప్రాంతాలు, అవసరాలు ఉన్న భారతదేశంలో కేంద్రీకృత పాలనకు కాలం చెల్లిందని, నిపుణులు సూచిస్తున్నారు.  జగన్ తీసుకున్న మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ, ఇవన్నీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు అయ్యే అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా జగన్ నిర్ణయాలకు ఈ స్థాయిలో మద్దతు లభిస్తుండగా, ఏపీలో మాత్రం రాజకీయ ప్రత్యర్ధులు జగన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, ఏపీ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: