తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం తీసుకువచ్చేందుకు ఆ పార్టీ కీలక నాయకులు ఇప్పుడు ముందడుగు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. జనసేన అధికారం కోసం కాదు, సమాజంలో మార్పు కోసమే అంటూ 2014లో ఎన్నికలకు ముందు జనసేన పార్టీని ఆర్భాటంగా పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఇక అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా బిజెపి టిడిపి కూటమికి మద్దతు పలికి అతి పెద్ద తప్పిదం చేశారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక 2014లో ఏపీలో తెలుగుదేశం పార్టీ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాయి. ఇక పవన్ కూడా 2019 ఎన్నికల ను టార్గెట్ గా చేసుకుని ఏపీలో బలపడాలని ముందుగా భావించినా, పరిస్థితులు అనుకూలించలేదు. పవన్ పై టిడిపి ముద్ర బలంగా పడిపోవడమే కాకుండా, టిడిపి ప్రభుత్వాన్ని విమర్శించలేదని పరిస్థితికి, మొహమాటానికి పవన్ వెళ్లిపోయారు. 

IHG


ఇక ఎన్నికల ముందు కూడా కూడా పదే పదే తాము అధికారం కోసం కాదు పార్టీ పెట్టింది అంటూ పదే పదే ప్రకటనలు చేశారు. మొన్నటి ఎన్నికల ప్రచారాల్లో తాను కానిస్టేబుల్ కొడుకుని, ఒక కానిస్టేబుల్ కొడుకు సీఎం అవ్వకూడదా అంటూ ప్రశ్నించారు. మరికొన్ని సభల్లో తమకు అధికారం అంటే వ్యామోహం లేదని, కనీసం 25 ఏళ్ల సమయం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చాము అంటూ పవన్ ఆవేశంగా ప్రసంగాలు చేశారు. తమకు అధికారం లేకపోయినా, ప్రజల కోసం, ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు జనసేన ప్రయత్నిస్తుందని పవన్ ప్రకటించారు. దీంతో జనాలకు అసలు జనసేన పార్టీకి ఓటు వేయాలా వద్దా ? అనే అనుమానాలు మొదలయ్యాయి. అనుకున్నట్టుగానే జనసేన పార్టీ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైంది. 

IHG


ఈ సంగతి పక్కన పెడితే, తాజాగా జనసేన పార్టీ పీఏసీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ విశాఖ పర్యటన లో కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతామని, అప్పుడు తప్పకుండా జనసేన పార్టీ ఏపీ లో అధికారంలోకి వస్తుందని, సీఎంగా అప్పుడు పవన్ ప్రమాణ స్వీకారం చేస్తారు అని నాదెండ్ల గొంతు పెంచి మరి చెప్పారు. అయితే నాదెండ్ల వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అవునవును మీ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, అప్పుడు పవన్  సీఎం, నాదెండ్ల, కన్నా లక్ష్మీనారాయణ డిప్యూటీ సీఎం లుగా ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ వ్యంగ్యంగా పలువురు కామెంట్లు చేశారు. ఏమైనా బిజెపి జనసేన కూటమి అధికారంలోకి రావాలని చూస్తున్నా, జనసేన పార్టీ వచ్చే ఎన్నికల వరకు బీజేపీతో కలిసి ఉంటుందా లేదా అనేది అందరిలోనూ సందేహాలు కలిగిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: