రాజధాని అమరావతి ప్రాంతంలో మొదలైన దీక్షలు చివరకు ఎక్కడికి దారి తీస్తాయో తెలీటం లేదు. రాజధాని గ్రామాల్లో కీలకమైన మందడం గ్రామం సీక్ యాక్సెస్ రోడ్డులో బహుజన పరిరక్షణ సమితి జేఏసి ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభమయ్యాయి. గడచిన 80 రోజులుగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి జేఏసి పేరుతో రైతులు, టిడిపి నేతలు దీక్షలు, ఆందోళనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

 

జగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న వీళ్ళు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ చేయగలిగిన రచ్చంతా చేస్తున్నారు. వైసిపి ప్రజా ప్రతినిధులపై దాడులు కూడా జరిగాయి. సరే వీళ్ళ ఆందోళనలు జరుగుతుండగానే హఠాత్తుగా బహుజన పరిరక్షణ జేఏసి ఆధ్వర్యంలో సోమవారం నుండి పోటి దీక్షలు ప్రారంభమయ్యాయి. వీళ్ళంతా జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతు చెబుతున్నారు. అంటే ఒకవైపు జగన్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆందోళనలుజ జరుగుతుంటే మద్దతుగా తాజాగా మరో గ్రూపు ఆందోళనలు మొదలుపెట్టింది.

 

మూడు రాజధానులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న వాళ్ళంతా రైతులకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తు ఆందోళన చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు వ్యతిరేకంగా ఎందుకంటే రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళపట్టాలు ఇవ్వటాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించటమే కాకుండా హైకోర్టులో కేసు కూడా వేశారు. రాజధాని నిర్మాణానికి తాము ఇచ్చిన భూముల్లో పట్టాలు వేసి పేదలకు పంచటాన్ని రైతులు వ్యతిరేకిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.

 

పేదలకు ప్రభుత్వం ఇళ్ళ స్ధలాలు ఇవ్వటాన్ని రైతులు వ్యతిరేకించటంలో అర్ధం లేదని బహుజన పరిరక్షణ సమితి నేతలు మండిపోతున్నారు. మొత్తానికి రెండు కీలకమైన అంశాలపై రాజధాని రైతులకు వ్యతిరేకంగా పోటి దీక్షలు మొదలవ్వటంతో అందరిలోను టెన్షన్ మొదలైంది. తమ దీక్షలకు పోటిగా బహుజన్ పరిరక్షణ పేరుతో పోటిలు దీక్షలు మొదల్లవ్వటాన్ని రైతులు తట్టుకోలేకపోతున్నారు. దాంతో ఏ రోజు ఏమవుతుందో అన్న టెన్షన్ పోలీసులను కూడా వదలటం లేదు. మొత్తానికి తెరవెనుక నుండి దీక్షలు చేయిస్తున్న వారు బాగాన ఉన్నారు కానీ క్షేత్రస్ధాయిలో ఉన్న వారిలో  మాత్రం ఆందోళన పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: