మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేత దిగ్విజయ్ సింగ్‌ గత రాత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలోని 17 మంది ఎమ్మెల్యేలు అందుబాటులో లేకుండా పోయారు. దీనిపై దిగ్విజయ్ మాట్లాడుతూ.. నిజమైన వ్యక్తులే పార్టీలో ఉంటారని.. మిగిలిన వారు కాంగ్రెస్‌ ను విడిచి వెళ్లొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాంగ్రెస్ పార్టీలోని కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాని ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపధ్యంలో సింధియాని కలవడానికి ప్రయత్నం చేశానని తెలిపాడు. కానీ.. ఆయన అందుబాటులోకి రాలేదని దిగ్విజయ్ తెలిపారు. అయితే.. సింధియా స్వైన్‌ ఫ్లూతో బాధపడుతున్నట్లు తనతో చెప్పారని అందుకే ఆయన అందుబాటులోకి రాలేకపోతున్నారని తెలిసిందన్నారు.

 


మధ్యప్రదేశ్‌ ఓటర్ల తీర్పును ఎవరైతే.. వద్దంటారో వారికి మధ్యప్రదేశ్ ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. నిజమైన కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలు ఎప్పటికీ పార్టీలోనే ఉంటారన్నారు. సింధియాను కలవడానికి మేం ప్రయత్నించామని కానీ.. ఆయన ఆరోగ్యం భాగొలేకపోవటంతో ఆయనతో మాట్లాడలేకపోయాం అని తెలిపారు. కాగా., ఆయనకు స్వైన్‌ ఫ్లూ వచ్చినట్లు తెలిసిందే.

 


కాగా., మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో సోమవారం రాత్రి నుంచి నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్న విషయం విధితమే.. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా, ఆయనకు మద్దతుగా ఉన్న  17 మంది ఎమ్మెల్యేలు అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. అయితే.. వీరిలో ఆరుగురు మంత్రులు ఉండగా వీరందరూ వారి ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేశారు. ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లి మకాం వేశారని ఆరోపణ. కాగా., వారిని సంప్రదించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.

 


మరోవైపు క్యాబినెట్ పునః వ్యవస్థీకరించాలని., అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఈ విధంగా నిర్ణయించారు. ఇందుకోసం దాదాపు 20 మంది మంత్రుల చేత ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ రాజీనామా చేయించారు. ఈ పరిణామాలకు జ్యోతిరాదిత్య అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం పీఠం దక్కలేదన్న అక్కసుతోనే ఆయన ఇదంతా చేయిస్తున్నారన్న విమర్శలు ఆయనపై వస్తున్నాయి. వారు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న వార్తలు మధ్యప్రదేశ్‌ లో చక్కర్లు కొడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: