కడప జిల్లాలో చంద్రబాబునాయుడు పెద్ద షాక్ తగిలింది. దశాబ్దాల పాటు టిడిపి తరపున వైఎస్ ఫ్యామిలిపై పోరాటాలు చేస్తున్న సతీష్ రెడ్డి తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేశాడు. ఒకటి రెండు రోజుల్లో సతీష్ రాజీనామా చేయబోతున్నాడనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ కారణంగానే మొన్న సతీష్ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు, చినబాబు పోటిలు పడి మరీ జన్మదిన  శుభాకాంక్షలు తెలిపారు. అయినా కానీ సతీష్ మాత్రం పార్టీకి రాజీనామా చేసేసి ఇద్దరికీ ఒకేసారి షాక్ ఇచ్చాడు.

 

రెండు సార్లు వైఎస్సార్ మీద పులివెందులలో ఎంఎల్ఏగా పోటిచేశాడు. తర్వాత రెండుసార్లు జగన్మోహన్ రెడ్డి మీద పోటి చేశాడు. పోటి చేసిన నాలుగు సార్లూ సతీష్ ఓడిపోయాడు. నిజానికి పులివెందులలో సతీష్ తప్ప మరో గట్టి నేతే లేడు. అలాంటిది ఒకసారి మాత్రం సతీష్ కు ఎంఎల్సీ అవకాశం ఇచ్చాడు చంద్రబాబు. వైఎస్ కుటుంబం మీద పోరాటాలు చేస్తున్న కారణంగా రెండోసారి కూడా అవకాశం ఇవ్వాలని ఎంత అడిగిన చంద్రబాబు పట్టించుకోలేదు.

 

తన స్ధాయికి మించే సతీష్ వైఎస్ కుటుంబం మీద పోరాటాలు చేశాడు. అయినా చంద్రబాబు ఎందుకనో పట్టించుకోలేదు. ఎప్పుడైతే తెలుగుదేశంపార్టీకి దూరమైపోతాడని ప్రచారం మొదలైందో అప్పటి నుండో సతీష్ గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం దెబ్బకు చాలామంది నేతల్లాగే సతీష్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నాడు. పార్టీకి దూరమైపోతాడనే ప్రచారం వల్లే మొన్నటి పుట్టినరోజున అబ్బా, కొడుకులు ఇద్దరూ జన్మదిన సుభాకాంక్షలు చెప్పారు.

 

సరే ఇంత చేసినా సతీష్ మాత్రం తన ఆలోచన ప్రకారమే టిడిపికి రాజీనామా చేసేయటం సంచలనంగా మారింది. దాంతో నియోజకవర్గంలో టిడిపికి రెండో నేతే లేకపోయాడు. ఎంఎల్సీ బిటెక్ రవి ది కూడా  పులివెందులే అయినా కార్యకర్తలకు అందుబాటులో ఉండడనే ఆరోపణలున్నాయి. ఎలాగూ పార్టీకి రాజీనామా చేశాడు కాబట్టి ఇక వైసిపి లో చేరటమే లాంచనమని సమాచారం. సతీష్ మార్గంలోనే  జమ్మలమడుగు మాజీ ఎంఎల్ఏ రామసుబ్బారెడ్డి కూడా టిడిపికి రాజీనామా చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. జగన్ అపాయిట్మెంట్ ఖాయమవ్వగానే రాజీనామా చేయటం ఖాయట. ఏదేమైనా చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: