గుంటూరు జిల్లా మాచర్ల లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టిడిపి నేతల కార్ల పై  వైసీపీ వర్గీయులు దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేశారు. టిడిపి నేతలు నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న సమయంలో అడ్డుకుంటున్నారని... నామినేషన్ పత్రాలను చించి పారేస్తు .... వైసీపీ శ్రేణులు దారుణంగా టిడిపి శ్రేణులు పై దాడులకు పాల్పడుతున్నారని తెలియడంతో... టిడిపి శ్రేణులను పరామర్శించేందుకు వాస్తవాలు తెలుసుకునేందుకు వెళ్లిన టీడీపీ నేతలు బుద్ధ వెంకన్న, బోండా ఉమా కార్లలో వెళ్లారు. ఇక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామని వెళ్తున్న సమయంలో... టిడిపి నేతలు వస్తున్నారని సమాచారం అందుకున్న వైసిపి వర్గీయులు... ఏకంగా ఒక్కసారిగా ద్విచక్ర వాహనాలపై 10 నుండి 15 మంది బుద్ధ వెంకన్న బోండా ఉమా వెళ్తున్న కార్లను అడ్డుకున్నారు. 

 


 ఈ సందర్భంగా బుద్ధ వెంకన్న బోండా ఉమా కార్లపై దారుణంగా కర్రలతో దాడికి దిగారు వైసిపి వర్గీయులు. కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారును ముందుకు నడపడంతో తీవ్ర దాడి నుంచి తప్పించుకోగలిగారు బోండా ఉమా, బుద్ధా వెంకన్న . ఇక ఈ దాడిలో టీడీపీ నేత బోండా ఉమా కు స్వల్ప గాయాలు కావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే సమయంలో అప్రమత్తమైన టీడీపీ వర్గాలు వైసీపీ దాడులు అడ్డుకునేందుకు సమాయాత్తం  కావడంతో..  ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ ఘటనపై తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 

 


 ఈ సందర్భంగా బోండా ఉమ, బుద్ధ వెంకన్న లతో లైవ్ లో  చరవాణి ద్వారా మీడియా ముందు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యం మంటగలిసింది అనే విధంగా వైసిపి వర్గీయులు తమపై దాడికి పాల్పడ్డారని.. తమతో పాటు ఉన్న అడ్వకేట్ తల పగల కొట్టారని... పోలీసులు వచ్చి అడ్డుకున్నప్పటికీ డీఎస్పీ వాహనం పైన కూడా వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారంటూ చరవాణి ద్వారా బోండా ఉమా చంద్రబాబుకు తెలిపారు. అంతేకాకుండా తమ చుట్టూ పోలీసులు ఉన్నారని.. ఇంత రక్షణ ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గం నుంచి తాము బతికి బయటపడతామన్న నమ్మకం మాత్రం లేదు అంటూ చెప్పుకొచ్చారు బోండా ఉమ,  బుద్ధ వెంకన్న. ఈ సందర్భంగా అటు చంద్రబాబు కూడా జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: