ఎన్నికలు వచ్చాయి అంటే రాజకీయాల్లో ఎన్నో పరిణామాలు చోటుచేసుకుంటాయని విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ బలంగా లేని సమయంలో.. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు అందరూ.. అధికార పార్టీ వైపు ఎప్పుడు ఎప్పుడు పోదామ అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాదు ఇక ఇతర పార్టీ నేతలను పార్టీలో చేర్చుకోవడానికి అదే సరైన సమయం అని భావించి అటు అధికార పార్టీ కూడా ఎంతో మంది నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు పార్టీకి తలుపులను ఓపెన్ చేసి  ఉంచుతాయి అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అదే జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

 


 ఎంతో మంది నేతలు ప్రతిపక్ష టీడీపీ పార్టీ నుంచి అధికార వైసీపీ పార్టీలో వాలి పోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అటు అధికార పార్టీ కూడా అందరికీ వెల్కమ్ చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉంది . దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వలసలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా నియమితులైన సుంకర  పద్మశ్రీని స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పార్టీలో చేసుకుంటున్నట్లు తెలిపి  కార్యకర్తలు కాస్త మనోధైర్యాన్ని ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుకున్నారు . వాస్తవంగా అయితే ఎన్నో రోజులనుండి టీడీపీ కి మద్దతుగానే ఉంటున్నారు  సుంకర పద్మశ్రీ. 

 


 ప్రస్తుతం జడ్పీ చైర్పర్సన్ పదవిని ఆఫర్ చేసి  తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు అన్నది ప్రస్తుతం టిడిపి ప్రచారం చేస్తుంది. అయితే ఆమె పార్టీలో చేరుతున్నరని  ఎలక్షన్ల సమయం లో ప్రచారం చేయాలనుకుంది టిడిపి. కానీ తీరా చూస్తే టిడిపి పార్టీకి చెందిన వాళ్ళు చాలా మంది వైసీపీ పార్టీ వైపు పరుగులు పెడుతున్నారు. కడప సతీష్ రెడ్డి,  రామసుబ్బారెడ్డి, బాబురావు,  రెహమాన్,  డొక్కా మాణిక్య వరప్రసాద్, రమేష్,  చింతలపూడి.... ఎన్నో ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న వారు మాజీ ఎమ్మెల్యేలకు సమానమైన హోదా ఉన్నవాళ్ళు  వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వాస్తవంగా వీరందరూ వైసీపీలో చేరేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో వీరిని  పార్టీలో చేర్చుకోవడం ద్వారా అటు ప్రతిపక్ష పార్టీ మనోధైర్యాన్ని దెబ్బతినడంతో పాటు... ఇటు అధికార పక్ష నేతలు కూడా మరింత కాన్ఫిడెన్స్ పెంచే విధంగా ఉంటుంది అని వైసీపీ సర్కార్ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: