ప్రపంచ దేశాలలో ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రాణభయంతో గా వణికిస్తున్న  విషయం తెలిసిందే. మొన్నటివరకు చైనా దేశంలో మూడు వేల మందికి పైగా ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నది  ఈ మహమ్మారి వైరస్. ఇప్పుడిప్పుడే చైనా దేశంలో తగ్గుముఖం పడుతుంది. కానీ ఇతర దేశాలలో మాత్రం విజృంభిస్తుంది ఈ ప్రాణాంతకమైన మహమ్మారి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కడ కరోనా  తమ వరకు వస్తుందోనని ప్రాణభయంతో చిగురుటాకుల్లా  వణికిపోతారు. ఇక భారత దేశాన్ని కూడా ఈ కరోనా  వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు భారతదేశంలో కరోనా  వైరస్ కేసుల సంఖ్య 62 కు చేరింది. దీంతో అటు ప్రభుత్వాలు కూడా ఎన్నో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. 

 

 అయితే మామూలుగానే ఏదైనా వైరల్ అయింది అంటే దాని మీద సినిమా తీయాలనే ఆలోచన దర్శకనిర్మాతలకు వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరోనా  వైరస్ పై  కూడా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట కన్నడ దర్శకుడు ఉమేష్ భునకర్. కరోనా  వైరస్ ఎఫెక్ట్ వల్ల తనకు ఓ కథాంశం దొరికింది అంటూ చెప్పుకొచ్చారు. అందుకే కరోనా  వైరస్ పై  సినిమా తీస్తానని ప్రకటించారు ఆయన. ఈ సినిమాకు డెడ్లీ కరుణ అనే టైటిల్ ను కూడా... రిజిస్టర్ చేయించారట కన్నడ దర్శకుడు ఉమేష్ భునకర్. 

 

 

 అంతేకాదండోయ్ కరోనా వైరస్ మీద సినిమా తీసేది ఏదో మామూలు సాదాసీదా సినిమా కాదు... ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా చేయబోతున్నారట. ఈ సినిమాలో అసలు కరోనా వైరస్ ఎలా వచ్చింది... ఎక్కడి నుంచి వచ్చింది.. ఎంత మంది చనిపోయారు.. ఇది ప్రజలపై ప్రభావం ఎలా చూపుతుంది... ఇలాంటి అంశాలను కీలకంగా తీసుకొని ఈ సినిమాలో చూపించబోతున్నారట కన్నడ దర్శకుడు ఉమేష్. గతంలో ఇలా వైరస్ కు సంబంధించిన సినిమా ఒకటి వచ్చిన విషయం తెలిసిందే.తమిళ  స్టార్ హీరో సూర్య హీరోగా సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కిన చిత్రం సెవెంత్ సెన్స్. మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఇక కరోనా కు  సెవెంత్ సెన్స్ సినిమా కి కాస్త సంబంధం ఉంది అని అటు ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా కరోనా వైరస్ పైన సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: