కరోనా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఆ వైరస్ ఎంత ప్రమాదకరమో ఇప్పుడిప్పుడే అందరికి తెలుస్తోంది. ఈ వైరస్ తో చాలా మంది మృత్యువాత పడ్డారు. ఇది భారత్‌ లో కూడా వేగంగా విస్తరిస్తున్నందున వైరస్ బాధిత సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతుంది. దీంతో అందరి పరిస్థితి ఆందోళన కరంగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఉద్యోగుల ఆరోగ్యాన్ని పరిణగలోకి తీసుకొని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ సదుపాయాన్ని కంపెనీలు కల్పిస్తున్నాయి.


కాగా., గురువారం (ఎస్‌‌టీపీఐ) సాఫ్ట్‌ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ను కల్పిస్తున్నట్లు ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది. దీంతో దాదాపు 18 నుంచి 20 లక్షల మంది కంపెనీ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే వారి పనిని సులువుగా చేసుకోబోతున్నారు. ఇప్పటికే వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ గురించి ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కరోనా వైరస్ ఉదృతంగా విస్తరిస్తున్న కారణంగా మోదీ సర్కార్ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేయడానికి అనుమతిచ్చారని తెలిపింది. కాగా., ఈ  నెల రోజుల పాటు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కల్పించాలని కోరింది. 


ఎస్‌టీపీఐ డైరెక్టర్ జనరల్ ఓంకార్ రాయ్.. వీలైనంత త్వరగా వారి ఆదేశాలను అమలు చేయాలని, ౩వేలకు పైగా ఎగుమతి దారులు తమ వద్ద రిజిస్టర్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం ఓఎస్‌పీ (అదర్ సర్వీసెస్ ప్రొవైడర్స్) విధానం కింద వర్క్ ఫ్రం హోమ్‌ పై కొన్ని ఆంక్షలు ఉన్నాయని, వాటిని ప్రత్యేక సందర్భాల్లో ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేసేందుకు కొన్ని రూల్స్ అనుమతినిస్తున్నాయన్నారు. అందుకే ఇప్పటికే మేం తమ వద్ద రిజిస్టర్ అయిన అన్ని ఐటీ యూనిట్లకు ఈ విషయాన్ని తెలియజేశామని తెలిపారు. 

 

కాగా., (డబ్ల్యూ‌హెచ్‌ఓ) వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనా వైరస్‌ ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. ఈ విషయం తెలిసిందే.. కాగా., ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల 4,000 మందికి పైగా మరణించారు. ఇంకా లక్ష కంటే ఎక్కువ మందికి పైగా వైరస్ బాధితులు ఉన్నారు. భరత్ లో కూడా కరోనా బాధితుల సంఖ్య 70కి చేరింది. ఈ పరిస్థితులు ఇలా ఉన్నందున ఫ్లిప్‌కార్ట్, గూగుల్ వంటి కంపెలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం కల్పిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: