2019 ఎన్నికల్లో ఓడినప్పటి నుండి  టిడిపి పార్టీ కి భారీ షాక్ లు తగులుతున్న విషయం తెలిసిందే. ఎంతో మంది టీడీపీ కీలక నేతలు అందరూ పార్టీని వీడి ఇతర పార్టీలలో  చేరుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పార్టీ ఫిరాయింపులు ఆంధ్ర రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా మంది టీడీపీ పార్టీకి చెందిన నేతలు అధికార పార్టీ వైపు వెళ్లడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది నేతలు టిడిపి పార్టీని వదిలి వెళ్లడంతో  చంద్రబాబు కు భారీ షాక్ లు తగులుతున్నాయి. ఇక తాజాగా ఈ అంశంపై మంత్రి ఆమంచి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో  మంత్రి బాలినేని శ్రీనివాస్ రావు,  చీరాల వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ కలిశారు. 

 

 

 ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమంచి... చీరాలలో రాజకీయంగా ఎలాంటి మార్పులు ఉండవు అంటూ జగన్ తనతో చెప్పారని ఆమె స్పష్టం చేశారు. ఇతర పార్టీ నేతలను ప్రలోభాలకు గురి చేసి గతంలో చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. గతంలో టీడీపీలో చేరికకు ప్రస్తుతం వైసీపీలో చేరికకు ఎంతో వ్యత్యాసం ఉంది అంటూ  ఆమంచి  అన్నారు. ఆ రోజున వైసీపీ పార్టీ నుంచి టిడిపి పార్టీ లోకి రావాలి అంటూ కాళ్ల వేళ్ల పడ్డారని... వైసీపీ ఎమ్మెల్యేలను డబ్బుతో కొల్లగొట్టారని ఆరోపించారు ఆమంచి.కానీ ప్రస్తుతం తమ  పార్టీ గానీ తమ పార్టీ నాయకుడు కానీ అలా చేయడం లేదు అంటూ తెలిపారు. 

 

 

 తమ పార్టీ అజెండా విధివిధానాలు నచ్చి వైసీపీ పార్టీలో చేరుతున్నారు అంటూ తెలిపారు మంత్ ఆమంచి . వైసీపీలో చేరిన వారికి తాము ఎలాంటి హామీలు ఇవ్వడం లేదని..  పదవులు ఇస్తాము  అని చెప్పడం గానీ చేయడం లేదు అంటూ స్పష్టం చేశారు. టిడిపిలో ఎంతో కాలంగా కొనసాగుతున్న నేతలు సైతం వైసీపీ పార్టీలో చేరుతున్నారని... మరో ఆరు నెలల్లో టిడిపి పార్టీ కచ్చితంగా మూత పడుతుంది అంటూ ఆమంచి  జోస్యం చెప్పారు. టీడీపీ మూతపడుతుందనే  ఉద్దేశం టీడీపీ నేతల్లో ఉంది కనుకే  పార్టీని వీడుతున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక తాజాగా టిడిపి పార్టీ నుంచి ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న కరణం బలరాం,  ఆయన తనయుడు కరణం వెంకటేష్ నిన్న జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: