ఏపీలో వైసీపీ ఎన్నికలు జరగక ముందే కొత్త రికార్డులు సృష్టిస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసేసరికి 9,696 ఎంపీటీసీ స్థానాలలో 2,000 స్థానాలకు పైగా ఏకగ్రీవం అయినట్లు సమాచారం. 652 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 125 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. రాజకీయ విశ్లేషకులు గతంలో ఇంత భారీ స్థాయిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అవ్వడం ఎప్పుడూ జరగలేదని చెబుతున్నారు. 
 
సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుండి ప్రజా సంక్షేమ పాలనే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవడం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో ప్రజల్లో వైసీపీకి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. కొన్ని ప్రాంతాలలో టీడీపీ నేతలు వైసీపీ ప్రజాదరణను చూసి పోటీకి దూరంగా ఉంటున్నారు. నిన్న రిటర్నింగ్ అధికారులు ఆయా స్థానాల్లో ఎంతమంది పోటీలో ఉన్నారన్న వివరాలను ప్రకటించారు. 
 
రిటర్నింగ్ అధికారులు ఒక అభ్యర్థే పోటీలో ఉన్న చోట ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ప్రకటన చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్రంలో జనరంజక పాలన సాగుతోంది. అర్హులైన వారందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల లబ్ధి చేకూరుతోంది. టీడీపీ తరపున పోటీ చేసినా గెలవడం అసాధ్యమని భావించి కొన్ని చోట్ల ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు ఆసక్తి చూపించటం లేదు. 
 
2019 ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో టీడీపీ భవిష్యత్తు గురించి ఆ పార్టీ నాయకుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. గత ఐదేళ్ల టీడీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. గత 9 నెలల్లో టీడీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరిగింది. ఎన్నికల్లో పోటీ చేసినా వృథా అని టీడీపీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. అందువల్ల చాలామంది అభ్యర్థులు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. 
  

మరింత సమాచారం తెలుసుకోండి: