ఏపీ జగన్ సీఎం చాలా తక్కువ సార్లు మీడియా ముందుకు వస్తారు.. సీఎం అయినా సరే.. పెద్దగా మీడియా ముందుకు రారు. అతి కొద్ది సార్లు మాత్రమే మీడియా సమావేశాలు నిర్వహిస్తారు. ఇక ఆయన వ్యవహార శైలి మిగిలిన నాయకులకు పూర్తిగా భిన్నం.. ప్రజాస్వామ్యంలో మూడు వ్యవస్థలు ఉంటాయి. రాజకీయ వ్యవస్థ ఎలాగో.. అధికారుల వ్యవస్థ కూడా అంటే.. అందులోనూ కొన్ని రాజ్యాంగబద్దమైన పదవులకు చాలా అపరిమితమైన అధికారాలు ఉంటాయి.

 

 

అలాంటి వాటిలో ఎన్నికల కమిషన్ కూడా ఒకటి. కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇవి రాజ్యాంగ బద్దమైన సంస్థలు. సాధారణ రోజుల్లో పెద్దగా ప్రాముఖ్యత లేని ఈ పదవులు ఎన్నికల సమయంలో మాత్రం చాలా పవర్ ఫుల్ అవుతాయి. ఒక్కసారి ఎన్నికల కోడ్ వచ్చిందంటే.. అన్ని అధికారాలు ఈ ఎన్నికల కమిషన్ కే చెందుతాయి. అందుకే సహజంగా ఈ ఎన్నికల కమిషన్లపై రాజకీయ నాయకులు పెద్దగా విమర్శలు చేయరు.

 

 

అందులోనూ అధికారంలో ఉన్నవాళ్లు ఇలాంటి సమయంలో సంయమనం పాటిస్తారు. కానీ ఏపీ సీఎం జగన్ రూటే సెపరేటు కదా. కోపం వస్తే..అవతల ఉన్నది ఎవరు అనే విషయం ఆయన లెక్కచేయరు. తాజాగా అదే జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడని నేపథ్యంలో జగన్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆయన ఓ రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న వ్యక్తి అని కూడా లెక్క చేయలేదు. గవర‌్నర్ను కలిసి నిమ్మగడ్డ తీరుపై ఫిర్యాదు చేశారు.

 

 

అంతేనా.. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఏకేశారు.. నిమ్మగడ్డ చంద్రబాబు మనిషి అని.. ఆయన కులానికే చెందినవారని.. చంద్రబాబు కోసం నిమ్మగడ్డ ఇంత దుస్సాహసం చేశారని.. ఇలాగైతే ఇక సీఎం ఎందుకు అని బహిరంగంగానే కడిగిపారేశారు. ఏదైనా జగన్ కు ఆగ్రహం వస్తే ముందూ వెనుకా చూడరని ఈ ఘటనతో మరోసారి రుజువైంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: