కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ 2019 జులై లో అదృశ్యమయ్యారు. అనంతరం కొన్ని రోజుల తర్వాత సిద్దార్థ మృతదేహం నేత్రావతి నదిలో లభ్యమైన విషయం విదితమే.. తర్వాత సిద్ధార్థ లేఖ రాసినట్టుగా బయట పడింది. కానీ.. సిద్ధార్థ సంతకంతో, తాజా లేఖలోని సంతకం సరిపోలడం లేదని ఐటీ శాఖ అధికారులు తేల్చారు. మరోవైపు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు డీకే శివకుమార్‌ సిద్ధార్థ అదృశ్యం, లేఖపై అనుమానం వ్యక్తం చేసిన 
విషయం తెలిసిందే. 


సిద్దార్ధ జూలై 28న తనకు కాల్‌ చేసి, తనను ఒకసారి కలవగలరా అని అడిగారని అప్పట్లో శివ కుమార్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. శివకుమార్ సిద్ధార్థ కుటుంబంతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని, సిద్దార్థ ఎంతో ధైర్యవంతుడైన వ్యక్తి అని, ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడంటే నమ్మలేకపోతున్నానంటూ  శివకుమార్‌ అనుమానం వ్యక్తం చేశారు.


కాగా., ఇప్పుడు ఈయన ఆత్మహత్య కేసులో షాకింగ్‌ విషయాలు బయటికి వస్తున్నాయి. కాగా., సిద్దార్థ్ పోయిన సంవత్సరం జూలైలో ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతరం కాఫీడే బోర్డు దర్యాప్తు చేపట్టింది. అయితే.. ఈ దర్యాప్తులో కీలక విషయాలు బయట పడ్డాయి. కేఫ్‌ కాఫీ డే బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే.. వారికి దాదాపు రూ.2000 కోట్లకు సంబంధించి లెక్కలు సరిపోలట్లేదని వారు తెలిపారు. కేసు ఇంకా దర్యాప్తు కాలేదని నివేదికను  
త్వరలోనే బయటపెడతామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. 


వీజీ సిద్దార్థ రాసిన లేఖలో ఓ పారిశ్రామిక వేత్తగా తాను విఫలమయ్యానని, కంపెనీ ప్రతి ఆర్థిక లావాదేవీకి తనదే బాధ్యత అని, ఇంకా తాను నిర్వహించిన లావాదేవీల వివరాలు కాపీ డే బోర్డు, ఆడిటర్లకు కానీ, సీనియర్‌ మేనేజ్‌ మెంట్‌ కు కానీ ఈ విషయాలు తెలియదని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. తాజాగా కాఫీ డేలో జరిపిన దర్యాప్తులలో వందల కొద్ది లావాదేవీలను దర్యాప్తు చేసిన తరవాత అధికారులు వాటిలో పెద్ద మొత్తంలో తేడాలున్నట్లు గుర్తించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: