రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారు.. ఇందుకు ఆయన తన విచక్షణ అధికారాలు వాడుకున్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకే ఇలా చేశానన్నారు. అంత వరకూ ఓకే.. అలా చేసేందుకు ఆయనకు అధికారం ఉంది. ఆ అధికారం సాక్షాత్తూ రాజ్యాంగం కల్పించింది.. కాబట్టి దాన్ని ప్రశ్నించలేం. కానీ.. వైసీపీ అడుగుతున్న ఓ ప్రశ్నకు మాత్రం నిమ్మగడ్డ సమధానం చెప్పడం లేదు.

 

 

ఇంకా ఏవేవో మాటలు చెబుతున్నా.. ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం దాటేస్తున్నారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తున్నప్పుడు రాష్ట్రప్రభుత్వాన్ని ఎందుకు సంప్రదించలేదు.? కనీసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని కూడా ఎందుకు సంప్రదించలేదు.? అసలు రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏంటో ఎందుకు కనుక్కోలేదు.? కేంద్ర ప్రతినిధులతో మాట్లాడాను అంటున్న నిమ్మగడ్డ.. మరి రాష్ట్ర అధికారులను ఎందుకు సంప్రదించలేదు..? ఇదీ ఆ ప్రశ్న.. దీనికి మాత్రం సమాధానం చెప్పడం లేదు.

 

 

రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎన్నికలు నిర్వహించడానికి.. ఆపడానికీ.. సర్వ హక్కులు ఉన్నాయి. కానీ ఎన్నికలు నిర్వహించాల్సింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందితోనే..అలాంటప్పడు రాష్ట్రాన్ని సంప్రదించకుండా ఎందుకు అంత పెద్దనిర్ణయం తీసుకున్నారు అన్న ప్రశ్నకు మాత్రం నిమ్మగడ్డ నీళ్లు నములుతున్నారు. సమాధానం దాట వేస్తున్నారు.

 

 

రాష్ట్రంలో కరోనా వైరస్ వచ్చిందా? రాలేదా అన్నది సమస్య కాదు. కరోనా వైరస్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది అడగడం తప్పు కాదు. కాని జరిగిందేమిటి? కరోనా వైరస్ సమస్య పై అనుమానాలు వస్తే ఎవరిని సంప్రదించాలి? కేంద్ర అదికారి ఎవరితో మాట్లాడానని చెబుతున్న రమేష్ కుమార్ తన పక్కనే ఉన్న చీఫ్ సెక్రటరీ నీలం సహానితో ఎందుకు మాట్లాడలేదు. అసలు ముఖ్యమంత్రి జగన్ కు పోన్ చేసి ఈ సమస్య ఇలా ఉంది..మీరు ఏమంటారు?అని ఎందుకు అడగలేదు. ఇదీ ఇప్పుడు నిమ్మగడ్డ చిత్తశుద్ధిని శంకిస్తున్న ప్రశ్న.

 

మరింత సమాచారం తెలుసుకోండి: