నేటి సమాజంలో మానవతా విలువలు పూర్తిగా మాయమవుతున్నాయి. వావివరసలు మరిచి సొంత వారితోనే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. వారి కామవాంఛ తీర్చుకోవడం కోసం ఎంతటి ఘాతుకానికైనా పాల్పడానికి సిద్ధంగా ఉంటున్నారు.

 

పిన్నతల్లి అంటే అమ్మ లాంటిది. అమ్మ స్థానంలో ఉండి మన బాగోగులు చూసుకుంటుంది. కానీ ఈమె మాత్రం ఆ తల్లి స్థానానికి మాయని మచ్చ తీసుకువచ్చింది. సవతి కొడుకుతోనే అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ ఘటన బ్రిటన్‌లో వెలుగు చూసింది.

 

యూకేలోని కాజిల్ హిల్లో ప్రాంతానికి చెందిన వ్యక్తికి మొదటి భార్య చనిపోయింది. ఆమెకు16ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కుమారుడి బాగోగులు చూసుకోవడానికి ఎవరు లేరు. దీంతో అతడు మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు.

 

ఆమె కొడుకుతో చనువుగా ఉంటూ అందచందాలతో రెచ్చగొట్టేది. దీంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి అక్రమ సంబంధానికి దారి తీసింది. రోజూ అతడిని స్కూల్‌కి కూడా పంపించకుడా కొడుకుతో రాసలీలలు కొనసాగిస్తూ ఉండేది.

 

గత కొద్దీ రోజులుగా కొడుకులో వచ్చిన మార్పును గమనించిన తండ్రి కుమారుడిపై నిఘా పెట్టాడు. ఇంట్లో స్పీకర్ ఏర్పాటుచేసి వారి మాటలను వినడం ప్రారంభించాడు. ఒక్కరోజు ఆమెను నిలదీశాడు. బాలుడు తన సొంత కొడుకుతో సమానమని చెప్పింది. 

 

సవతి తల్లి సరిగ్గా చూసుకోవడం లేదని అందరూ అనుకోకూడదన్న ఉద్దేశంతో అతడితో చనువుగా ఉంటున్నట్లు చెప్పింది. అతడు కొడుకుతో ఏకాంతంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నాడు. సవతి తల్లి తనను రోజూ సెక్స్ కోసం ఒత్తిడి తెస్తోందన్నాడు. తనని స్కూల్‌కి కూడా పంపకుండా బెడ్రూమ్‌‌లోకి లాక్కెళ్తుతోందని చెప్పాడు.

 

కొడుకు చెప్పిన మాటలు విన్న తండ్రి షాక్ అయ్యాడు. అతడి తండ్రి భార్యపైనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైనర్ బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడి వాంగ్మూలం ద్వారా కోర్టులో ఆమెపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం ఆ మహిళను దోషిగా నిర్ధారించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: