దేశవ్యాప్తంగా ఎనిమిది సంవత్సరాల క్రితం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ పారా మెడికల్ విద్యార్థిని కదులుతున్న బస్సులో అత్యంత కిరాతకంగా లైంగిక దాడి చేసి.. అత్యంత పాశవికంగా రేప్ చేసిన నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఎట్టకేలకు శుక్రవారం ఉదయం ఉరి శిక్ష అమలు చేశారు. దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఎన్నో మలుపులు... ఎన్నో చర్చల తర్వాత వీరికి ఎట్టకేలకు ఉరి శిక్ష అమలు చేశారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు శిక్ష అనుభవించారు. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న‌ బస్సు డ్రైవర్ రామ్ సింగ్ 2013లో జైలులో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.



ఈ సంఘ‌ట‌న ఢిల్లీలో డిసెంబ‌ర్ 16, 2012లో జ‌రిగింది. దేశం మొత్తం ఈ సంఘ‌ట‌న‌తో క‌దిలింది. ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌స్సుల‌ను క‌లిచి వేసింది. ఎవ‌రికి వారు స్వ‌చ్ఛందంగా రోడ్ల‌మీద‌కు వ‌చ్చి శాంతియుత నిర‌స‌న‌లు చేప‌ట్టారు. ఇక రామ్ సింగ్ ఆత్మ‌హ‌త్య చేసుకోగా.. మ‌రో మైన‌ర్ మాత్రం మూడేళ్లు జైలు శిక్ష అనంత‌రం జునైల్ హోమ్ నుంచి రిలీజ్ అయ్యారు. ఇక మిగిలిన న‌లుగురు నిందితులు అయిన ప‌వ‌న్‌, ముఖేష్‌, అక్ష‌య్‌, విజ‌య్ ఉరి శిక్ష నుంచి త‌ప్పించుకునేందుకు వేసిన ప్ర‌య‌త్నాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి.


న‌లుగురిని ఉరి శిక్ష నుంచి త‌ప్పించేందుకు వారి త‌ర‌పున వాదిస్తోన్న న్యాయ‌వాది ఏపీ. సింగ్ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారు. చివ‌ర‌కు వారిని బోర్డ‌ర్‌కు పంపితే దేశ సేవ చేస్తార‌ని కూడా కోర్టుకు విన్న‌వించు కున్నారు. అస‌లు ఈ కేసులో వీరికి ఉరి శిక్ష ఎనిమిది సంవ‌త్స‌రాల‌కు ప‌డింది అంటే అందుకు ఆయ‌న ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసి వీరిని కాపాడేందుకు ప్లాన్ చేశారో అర్థ‌మ‌వుతోంది. ఇక త‌న కుమార్తెను చంపిన వారి త‌ర‌పున వాదించిన సింగ్‌పై నిర్భ య తండ్రి ప్ర‌శంస‌లు కురిపించ‌డం విశేషం. ఓ న్యాయ‌వాదిగా ఆయ‌న ప‌ని ఆయ‌న స‌మ‌ర్థ‌వంతంగా చేశార‌ని.. చివ‌ర‌కు న్యాయం గెలిచింద‌ని ఆయ‌న చెప్ప‌డం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: