ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు ఇప్పటి వరకు నివారణ మందును కనుకోలేదు. ఒక్కవైపు ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తూ ఒక్కో దేశంలో అడుగు పెడుతుంది. ఇది అడుగు పెట్టిన ప్రతి చోట ప్రాణాలను బలి తీసుకుంటూ వెళ్తుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇప్పుడు భారత్‌ లో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది.

 

కరోనా మన దేశంలో చాప కింద నీరులా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి మన దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. మన దేశానికి విదేశాల నుండి రావడంతో.. దేశంలో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే మన దేశంలో ఐదుగురు చనిపోయారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 258 కేసులు నమోదైయ్యాయి. అందులో 35 కేసులను గుర్తించారు. 

 

దేశంలో కరోనా వైరస్ కేసులు సంఖ్య ఎక్కువగా నమోదు అవుతున్నాయి.దింతో ఐసీఎంఆర్ అపెక్స్ బాడీ కోవిడ్ నిర్ధారణ పరీక్ష విధానంలో మార్పులు చేసింది. ఓ వ్యక్తికి కరోనా వైరస్ నిర్ధారణ అయితే అతడితో ప్రత్యక్షంగా కాంటాక్టులో ఉన్నవారికి ఐదో రోజు, 14వ రోజు నమూనాలను పరీక్షించాలని కొత్త మార్గదర్శకాలు పేర్కొన్నారు.

 

ఇలా చేయడం వలన వైరస్ వ్యాప్తి సమర్థవంతంగా నిరోధించ వచ్చున్నారు. నిర్ధారణ పరీక్షలు క్రమానుగతంగా మారుతాయని స్పష్టం చేసింది. కరోనా వైరస్ తీవ్రత, నియంత్రణ గురించి ఏర్పాటుచేసిన ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ వీకే పాల్ నేతృత్వంలోని ఏర్పాటైన నేషనల్ టాస్క్‌ ఫోర్స్ వ్యాధి నిర్ధారణ పరీక్షలపై సమీక్ష నిర్వహించి ఈ మార్పులు చేపట్టారు.

 

దేశంలో నిర్ధారణ అయిన కరోనా కేసులన్నీ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో పర్యటించిన వారితో కాంటాక్ట్‌ లో ఉన్నవారిలోనే గుర్తించారు. దేశంలో ఇంత వరకూ కరోనా వైరస్ సమూహాల నుంచి వ్యాపించినట్టు గుర్తించలేదు. వైరస్ కమ్యూనిటీ ద్వారా వ్యాప్తి చెందితే మరోసారి వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో మార్పులు ఉంటాయని ఐసిఎంఆర్ ఈ సందర్బంగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: