కరోనా జనాన్ని బాగా ఇబ్బంది పెడుతోంది. దేశాలు దాటి ఈ కరోనా అందర్నీ బాధిస్తోంది. ఇప్పటికే ఎలర్ట్ అయ్యాయి రాష్ట్ర ప్రభుత్వాలు . అయితే భారత దేశం లో అనేక రాష్ట్రాలలో ప్రజలని ఇప్పటికే ఇబ్బంది పెట్టింది. అందుకే కట్టడి చెయ్యడానికి అనేక నిర్ణయాలు తీసుకుంటోంది ప్రభుత్వం. అయితే నిన్న జరిగిన కర్ఫ్యూ పై కూడా తెలంగాణ సర్కారు సీరియస్ అయ్యింది .

 

 

మోదీ ఇచ్చిన పిలుపుని వారు గౌరవిస్తూ పాటించారు. ఒక్క తెలంగాణ లో 24 గంటల పాటు ఈ కర్ఫ్యూ లో పాల్గోవాలని కేసీఆర్ చెప్పారు. దానితో వారు దీనిని పాటించారు. అయితే ఈ మాటకి విరుద్ధంగా నడిచిన వారిపై యాక్షన్  తీసుకున్నారు. ఈ నేపథ్యం లో మార్చి 31 వరకు రాష్ట్రం లో లాక్ డౌన్ విధించిన సరే ప్రజలంతా ఉదయాన్నే రోడ్డు మీదకి రావడంతో తెలంగాణ సర్కారు మండిపడింది. ఇప్పటికే సరి హద్దుల్ని మూసేసారు, ఆర్టీసీ కూడా బంద్ చేసేసారు.

 

 

అయితే ప్రజల తీరుని చూసి ఫైర్ అయ్యింది తెలంగాణ సర్కార్. ప్రెస్ మీట్ పెట్టి సీఎస్ సోమేశ్ కుమార్ , డీజీపీ మహేందర్ రెడ్డి ప్రజల తీరు పై అసహనం చూపించారు. చట్టం ప్రకారం లాక్ డౌన్ విధించారని తెలియజేశారు. అంతే కాకుండా అనవసరంగా ప్రజలు బయటకి రావద్దు అని కూడా చెప్పారు. కేవలం ఎమర్జన్సీ అయితేనే ఇంటి నుండి బయటకి రావాలని అన్నారు .

 

ఐదు కంటే ఎక్కువ మంది గుమికూడడం మంచిది కాదు అని అన్నారు. అయితే రోడ్డు మీద వాహనాల తో రాత్రి ఏడు నుండి ఉదయం ఆరు వరకు ఎవరైనా తిరిగితే వారి పై కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఎక్కువ కనిపించిన వాహనాల్ని సీజ్ చేసేస్తారని చెప్పారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: