కరోనా  వైరస్... కరోనా వైరస్ కరోనా  వైరస్... ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది ఎవరిలో  చూసినా ఇదే భయం కనిపిస్తోంది... ప్రస్తుతం ఎంతో మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది ఈ మహమ్మారి వైరస్. దీంతో ప్రపంచం మొత్తం కంటికి కనిపించని శత్రువుతో భయంభయంగా పోరాటం చేస్తోంది. ఈ పోరాటంలో జయించలేక ఎంతోమంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను చిగురుటాకుల వణికిస్తూ ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటోంది ప్రాణాంతకమైన మహమ్మారి కరోనా . ఇక ఎంతోమందిని మృత్యువుతో పోరాడేలా చేస్తుంది. అయితే ఈ వైరస్ ఎక్కువగా వ్యాపించడానికి కారణం ప్రజల్లో ఉన్న నిర్లక్ష్యమే అని చెప్పవచ్చు. వైరస్ లక్షణాలు ఉన్నప్పుడు ఆ వైరస్ లక్షణాలు నిర్లక్ష్యం చేయడం కారణంగానే ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో పరిస్థితి చేయి దాటి పోతుంది. 

 

 

 ముఖ్యంగా అవగాహన లేమి నిర్లక్ష్యం కారణంగానే ఈ వ్యాధి మరింతగా వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి ఘటనే జరిగింది దక్షిణ కొరియాలో. ప్రస్తుతం దక్షిణ కొరియాలో వేలాది మందిని ఈ మహమ్మారి బారిన పడి మృత్యువుతో పోరాడుతున్నారు. అయితే ఈ వైరస్ ను నియంత్రించేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. అయితే దక్షిణ కొరియాలో ఈ వైరస్ వ్యాప్తికి మూల కారణం ఏమిటో అక్కడి వైద్య శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఓ యువతి నిర్లక్ష్యమే... ప్రస్తుతం ఇంత ఆందోళనకర పరిస్థితులకు కారణమని వైద్యులు వెల్లడించారు. దక్షిణ కొరియాకు చెందిన ఓ మహిళ ఉదయం ప్రార్థనల కోసం చర్చ్ కి వెళ్లగా .. అక్కడ ప్రార్థన కోసం వచ్చిన పన్నెండు వందల మంది కరోనా  కోరల్లో చిక్కుకున్నారు. ఇక ఆ తర్వాత ఆ మహిళకు  ఫిబ్రవరి 6వ తేదీన ఒక చిన్న ప్రమాదం జరగా వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్ళింది. 

 

 

ఇక ఆ సమయంలో ఆస్పత్రిలో ఉన్న 119 మంది ఈ మహిళ కారణంగా కరోనా  బారిన పడ్డారు. ఇక్కడితో ఆగకుండా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఆ మహిళ ఓ హోటల్లో పార్టీకి వెళ్లగా అక్కడ ఉన్న చాలామంది ఈ మహిళ నిర్లక్షం కారణంగా కరోనా  వైరస్ తో  పోరాడాల్సి వచ్చింది. అయితే ఆ మహిళ కరోనా  వైరస్ లక్షణాలను గుర్తించకపోవడం నిర్లక్ష్యం వహించడం కారణంగా... వివిధ సందర్భాల్లో  ఏకంగా 5000 మందికి ఆ మహిళ కారణంగా మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందింది. ఇందులో కొంత మంది మృత్యువాతపడ్డారు కూడా. ప్రస్తుతం సదరు మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా సదరు మహిళ పై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక రోజురోజుకు దక్షిణకొరియా లో వైరస్ అనుమానితుల సంఖ్య పెరిగిపోతుండడంతో... అనుమానితులను క్వారంటైన్  కు తరలించి ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: