కరోనా వైరస్ ఇప్పుడు ఈ మాట వింటే చాలు అందరి గుండెల్లో గుబులు పుడుతుంది. ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. అమెరికా దేనికి భయపడని అమెరికా కూడా ఇప్పుడు ఈ వైరస్ చెప్తే గడగడలాడుతుంది. ఇప్పటికే ఈ వ్యాధి మన దేశంలో వేగంగా విస్తరిస్తుంది. మన దేశంలో ఒక్క రోజులోనే 99 కేసులు నమోదైయ్యాయి. 

 

తాజాగా తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 36కు చేరింది. మంగళవారం మరో ముగ్గురికి కోవిడ్ సోకినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటీవల లండన్ వెళ్లి వచ్చిన 49 ఏళ్ల వ్యక్తికి, జర్మనీ నుంచి వచ్చిన 39 ఏళ్ల మహిళకు, సౌదీ నుంచి తిరిగొచ్చిన 61 ఏళ్ల మహిళకు కరోనా సోకినట్లు ప్రభుత్వం తెలిపింది. వీరు ముగ్గురూ హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన వారేనని తెలిపింది. కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులేస్తోంది.

 

అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యాధి వ్యాపించకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మర్చి 31 వరకు రాష్ట్రములో లోక్ డౌన్ విధించారు. దీని వలన ఈ వ్యాధిని కొంత వరకు అయినా అరికట్ట వచ్చు అనే కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి కొందరు నాయకులు ప్రశంసించారు.

 

కరోనా వైరస్‌పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. రాష్ట్రంలోని లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు కరోనా వైరస్‌ పై ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమని ప్రకటించారు. నిత్యావసర సరుకుల ధరలను అదులోకి తీసుకురావాలన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా దళారులపై చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త కరోనా వ్యతిరేక సేవకుడిగా సేవలందించాలని పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: