దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45కు చేరగా ఏపీలో 11కు చేరింది. ప్రధానిమోదీ దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. కానీ కొన్నిచోట్ల ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం దుకాణాల దగ్గర గుమికూడుతున్నారు. 
 
విజయవాడలో కరోనా ముందుజాగ్రత్తచర్యల్లో భాగంగా ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావాల్సిన అవసరం లేకుండా ఒక్క ఫోన్ కాల్ తో నిత్యావసర వస్తువులు ఇంటికి చేరే విధంగా విజయవాడ నగర కమిషనర్ చర్యలు చేపట్టారు. ప్రజలు ఫోన్ చేసి వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు చెబితే... ఆ సరుకులు ఇంటి వద్దకే సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టారు. ఫోన్ నంబర్లకు కాల్ చేసి ఎంఆర్‌పీ ధరలకే నిత్యావసర వస్తువులను డోర్ డెలివరీ ద్వారా పొందవచ్చు. 

\r\n

\r\n


 

\r\n

కరోనాను తరిమికొట్టేందుకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని... ఫోన్ కాల్ ద్వారా నిత్యావసర వస్తువులను ఆర్డర్ చేసుకోవాలని... నగరంలో ఎవరైనా అధిక ధరలకు నిత్యావసర వస్తువులను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, ముఖ్య పట్టణాల్లో అతి త్వరలో డోర్ డెలివరీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. 
 
ఇప్పటికే పలు పట్టణాల్లో ప్రజలకు డోర్ డెలివరీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నగరంలోని 12 వ్యాపార సంస్థల ఫోన్ నంబర్లను వైసీపీ నేత దేవినేని అవినాష్ షేర్ చేశారు. బిగ్ బజార్, రిలయన్స్ మార్ట్, స్పెన్సర్స్, రిలయన్స్ ఫ్రెష్, మెట్రో, మోడరన్ సూపర్ మార్కెట్, అమరావతి సూపర్ మార్కెట్, డి మార్ట్, గ్రాండ్ మోడరన్, ఇతర సూపర్ మార్కెట్ల ద్వారా విజయవాడ నగర ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయవచ్చు.

\r\n

\r\n

విజయవాడ నగర ప్రజలకు నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ చేయడానికి ఏర్పాట్లు చేసిన కమిషనర్ గారికి ధన్యవాదాలు. ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తే ఎమ్మార్పీ ధరలకే సరుకులు ఆటో లో ఇంటికి పంపించడానికి ముందుకు వచ్చిన 12 సూపర్ బజార్లు#21daysLockDown#Covid19India#StayHomeChallenge#AndhraFightsCoronapic.twitter.com/Lo47EzQErY

\r\n— devineni avinash (@DevineniAvi) March 26, 2020

మరింత సమాచారం తెలుసుకోండి: