కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. ఇప్పటికే పత్రికా రంగం అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటోంది. పెరిగిన న్యూస్ ప్రింట్ ధరలు, తగ్గుతున్న ఆదాయాలతో ప్రింట్ మీడియా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీనికి తోడు ఇప్పుడు కరోనా ప్రభావం కూడా. కరోనా ధాటికి కొన్ని పత్రిక పంపిణీ కూడా కష్ట సాధ్యంగా మారింది. కరోనా దెబ్బతో చాలా చోట్ల హ్యాకర్లు చేతులెత్తేశారు కూడా.

 

 

అయితే ఈనాడు వంటి దిగ్గజ సంస్థలకు సొంత పంపిణీ వ్యవస్థ ఉంది కాబట్టి పంపిణీ చాలా వరకూ సాఫీగానే సాగుతోంది. అయితే కరోనా ప్రభావమో ఏమో గానీ.. కరోనా ప్రభావం ప్రారంభమైన తర్వాత ఈనాడు మరీ చిక్కిపోతోంది. అవును ఇప్పటికే నిర్వహాణా పరమైన కష్టనష్టాలతో పత్రికలు తమ పేజీల సంఖ్యను బాగా తగ్గిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఈనాడు కూడా 14 పేజీల ప్రధాన పత్రికను మెయింటైన్ చేస్తూ వచ్చింది.

 

 

ఆ తర్వాత దాదాపు 20 పేజీల టాబ్లాయిట్ కూడా ఉంటోంది. అయితే ఇప్పుడు ఈనాడు బాగా చిక్కిపోయింది. కొన్ని రోజులుగా కేవలం ప్రధాన పత్రిక పది పేజీలకే పరిమితమైపోయింది. కరోనా వార్తలకే ప్రాధాన్యం దక్కుతోంది. ఇన్నాళ్లు ప్రత్యేక ఆకర్షణగా వచ్చిన ప్రత్యేక పేజీలపై ఈ ప్రభావం బాగా పడింది. ప్రధాన పేజీల్లో ఇచ్చే ప్రత్యేక పేజీలను తాత్కాలికంగా ఇవ్వడం లేదు. బహుశా కరోనా ప్రభావమై ఉండొచ్చు.

 

 

ఎంతైనా ఈనాడు తెలుగులోనే అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక. ఈనాడు చదవందే చాలా మందికి పొద్దుపోదు. సూర్యోదయం కాదు. అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈ పత్రిక సొంతం. పాలసీల పరంగా ఎన్ని అభ్యంతరాలు ఉన్నా ఈనాడు ఈనాడే అని విమర్శలు కూడా మెచ్చుకుంటారు. అలాంటి ఈనాడు పది పేజీలకే పరిమితం అవుతోంది. మరి ఈ మార్పు కరోనా కాలానికే పరిమితమా.. లేక శాశ్వతమా అన్నది కొన్నిరోజులు ఆగితే కానీ తెలియదు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: