దేశంలో క‌రోనా ఈ రేంజ్‌లో విజృంభిస్తున్నా మ‌న నేత‌లు మాత్రం రాజ‌కీయాలు మాన‌డం లేదు. ఇటు ఏపీలోనూ.. అటు తెలంగాణ‌లోనూ అధికార , ప్ర‌తిపక్షాల నేతలు ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు కురిపించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఏపీలో ఇప్ప‌టికే అధికార వైసీపీ, విప‌క్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతుండ‌గా తెలంగాణ‌లో చ‌ప్ప‌గా ఉంద‌నుకున్న రాజ‌కీయం కాస్త ఇప్పుడిప్పుడే వేడెక్కుతోంది. తాజాగా టీ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్ర‌భుత్వంపై విమర్శ‌ల వ‌ర్షం కురిపించారు.

 

తెలంగాణలో 13 రోజులుగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ.. ఇప్పటి వరకు కేవలం 22లక్షల టన్నుల బియ్యం మాత్రమే పేదలకు పంపిణీ జరిగిందని విమర్శించారు. అలాగే కాంగ్రెస్ నేత‌లు ఎంతో సామాజిక బాధ్య‌త‌తో వైర‌స్ నివార‌ణ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటున్నార‌ని ప్ర‌శంసించారు. జడ్చర్ల నియోజకవర్గ సమన్వయకర్త అనిరుధ్‌ రెడ్డి తన సొంత ఖర్చుతో ప్రజలకు శానిటైజర్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. శానిటైజర్లు తీసుకెళ్తున్న వాహనాలను గాంధీభవన్‌ వద్ద ఉత్తమ్‌ జెండా ఊపి ప్రారంభించారు. 

 

ఇక తాము నిర్మాణాత్మ‌క ప్ర‌తిప‌క్షంగా ప‌ని చేయ‌డంతో పాటు సూచ‌న‌లు.. స‌ల‌హాలు అందిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తిలో కొందరు మతాన్ని వేలెత్తి చూపుతున్నారని.. అది సరైంది కాదని ఉత్తమ్‌ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో రేష‌న్ కార్డు దారుల‌కు అందిస్తామ‌న్న రు. 1500 ఇప్ప‌టికే ప్ర‌క‌టించినా... ఆ మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రికి అంద‌లేద‌ని చెప్పారు. అలాగే కేంద్రం ఇస్తామ‌న్న బియ్యం కూడా ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌కు అందలేద‌ని అన్నారు. ఏదేమైనా ఉత్త‌మ్‌కుమార్ రెడ్డిది కోప‌మా ?  లేదా స‌ల‌హాలా ? అన్న‌ది అర్థం కాని ప‌రిస్థితి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: