కోరలు చాస్తున్న కరోనా  ఎంతో మందిని బలితీసుకుంది. కంటికి కనిపించకుండా దాడిచేసి కాటికి పంపిస్తుంది. ఎంతోమందికి ప్రబలి ప్రాణాలను హరించుకుపోతుంది. ఎంతోమందిని మృత్యువుతో పోరాడేలా చేస్తుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలలో చిగురుటాకులా వణికిపోతున్న విషేయం తెలిసిందే . దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్నాయి. అయితే అన్ని దేశాల పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కొన్ని దేశాల్లో మాత్రం రోజురోజుకూ పరిస్థితి చేయి దాటి పోతుంది. అమెరికా స్పెయిన్ ఇటలీ లాంటి దేశాలలో రోజురోజుకు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో పాటు కరోనా  వైరస్ మరణాల  సంఖ్య కూడా పెరిగిపోతుంది. 

 

 మొదట అమెరికాలో కరోనా  వైరస్ను లైట్ తీసుకున్నప్పటికీ  ప్రస్తుతం అమెరికాలో కూడా కరోనా వైరస్ ప్రభావంతో ఎంతో మంది బలవుతున్నారు. అయితే ప్రస్తుతం అమెరికాలో మారణహోమం జరుగుతుంది అని చెప్పాలి . అయితే ప్రస్తుతం అమెరికా దేశంలో మహమ్మారి వైరస్  మరణ మృదంగం మోగిస్తున్న  వేళ 16 మంది భారతీయులకు కరోనా  వైరస్ సోకింది. అమెరికాలో 16 మందికి కరోనా వైరస్ ఉండగా అందులో 11 మంది మరణించారు అంటూ అక్కడి అధికారులు చెబుతున్నారు. వైరస్ బారిన పడి అమెరికాలో మృతి చెందిన భారతీయులు నలుగురు టాక్సీ డ్రైవర్లు, సహా పలువురు ఉద్యోగులు ఉన్నారు. 


 కరోనా  వైరస్ బారినపడి మృతి చెందిన బాధితులు ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారుగా తెలిపారు. కాగా 11 మంది అమెరికాలో భారతీయులు ప్రాణాలు కోల్పోగా మరో 16 మందికి కరోనా  వైరస్ పాజిటివ్ అని తెలిపారు . అయితే ప్రస్తుతం అమెరికాలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా భారిన పడగా..  ఇప్పటి వరకు అమెరికాలో మృతిచెందిన కరోనా  వైరస్ బాధిత భారతీయుల్లో  మొత్తం పురుషులే ఉండటం గమనార్హం. కాగా  అమెరికాలో ఎక్కువగా కరోనా వైరస్ మరణాల సంఖ్య పెరిగిపోతుంది న్యూయార్క్ లోనే  అని వెల్లడించారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: