ఆదిలాబాద్ జిల్లాలో లిక్కర్ బ్లాక్ మార్కెట్ దందా యథేచ్చగా  సాగుతోంది. అదేంటీ షాపులన్నీ లాక్ చేశారు కదా అనుకుంటున్నారా... అది నిజమే కానీ ఇది కూడా నిజమే. సరుకు వెనకడోర్ నుంచి  తరలించి ఫుల్లుగా బిజినెస్ చేసేస్తున్నారు. పాత ధరకు మూడింతలు పెంచి షాపుల్లోని లిక్కర్ మాయం చేసేస్తున్నారు. 

 

మద్యం వ్యాపారులు తమ వైన్స్ లోని లిక్కర్ ను బయటకు తీసి మరీ అందినకాడికి దండుకుంటున్నారు. ఈబ్రాండ్ ఆబ్రాండ్ అనే తేడాలేదు. అసలు ధరకంటే మూడింతలిస్తే ఏబ్రాండ్ మందైనా బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారు.  పైకి మాత్రం మద్యం షాపులకు తాళాలు..అధికారులు  వేసిన సీళ్లు వేసినయ్ వేసినట్టుగానే ఉంటాయి. సరుకు మాత్రం మాయమవుతూ ఉంటుంది.

 

పట్టణ ప్రాంతాల్లోని వైన్స్ కు తాళాలు వేసుకోమని  చెప్పిన ఎక్సైజ్  అధికారులు కొన్నిచోట్ల  సీల్ వేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం లిక్కర్ షాపులకు సీల్ వేయలేదు..దీంతో దొరికిందే సందని షాపుల్లో నిల్వ ఉన్న స్టాక్ మొత్తం ఖాళీ చేసేశారు. ఇందతా పంటపోలాల్లో గొయ్యిలు తీసి డంప్ చేసుకుని మరీ గుట్టుచప్పుడు కాకుండా అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

 

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని బోయపల్లి బోర్డ్ ఏరియాలోని రైస్ మిల్లు.. ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు భారీగా  బీర్లు, క్వార్టర్ సీసాలు నిల్వచేశారు. పక్కా సమాచారంతో దాడిచేసిన పోలీసులు సరుకును స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లాలో కొంతమంది రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో వ్యాపారులు తమ వైన్స్ ను ఓపెన్ చేసి మద్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా స్టాక్ చేసుకుని విక్రయిస్తున్నారు. 

 

ఆదిలాబాద్ జిల్లాలో సైతం మద్యం వ్యాపారుల ఆగాడాలు అంతా ఇంతా కాదు..ఇక్కడ 31 వైన్స్, 14 బార్లు ఉన్నాయి.. ఇందులో కప్పర్ల, సుంకిడి, బేలాతోపాటు జిల్లా కేంద్రంలోని కొన్ని బార్లు,వైన్సులలో స్టాక్ మాయం చేసేశారు. దగ్గరుండి కొంతమంది అధికారులు తీయించారనే ఆరోపణలు ఉన్నాయి. పాత  సీల్ తొలగించి కొత్త సీల్ వేసిన ఆనవాళ్లు సైతం షాపుల వద్ద ఉన్నాయి.  ఆరోపణలు రావడంతో ఇచ్చోడలోని ఓ వైన్స్ లో అధికారులు తనిఖీలు చేశారు...స్టాక్ వివరాలు విక్రయాల చిట్టా చూసారు..కాని ఏంజరిగిందనే విషయాన్ని మాత్రం బయటపెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

 

జిల్లా కేంద్రంతోపాటు రూరల్ ప్రాంతాల్లో లిక్కర్ డాన్ లు వైన్స్ లనుంచి తీసుకెళ్లిన మద్యాన్ని  సిండికేట్ షాపుల్లో , పాత భవనాల్లో నిల్వులు చేశారు. బండల్ నాగపూర్, కప్పర్ల, అలాగే వివిధ గ్రామాల్లోని పంటపోలాల్లో గోతులు తీసి మరీ నిల్వలు చేసి విక్రయిస్తున్నారు..ఇక్కడ ఓ లిక్కర్ కింగ్ గా పేరుగాంచిన రాజకీయ నేత  అండతో రెచ్చిపోయి విక్రయాలు సాగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

 

రెడ్ లేబుల్ ఫుల్  బాటిల్ ధర 2200 అయితే  ప్రస్తుతం ఐదువేలకు పైగా విక్రయిస్తున్నారు.హండ్రడ్ పైపర్ ధర 1750 రూపాయలైతే...4 వేలుకు బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారు. బీ7 బ్రాండ్ ఫుల్లు 680 కాగా,   2500  కు అమ్ముతున్నారు. రాయల్ స్ట్రాగ్  700 రూపాయలు కాగా.,  బ్లాక్ లో 3 వేలకు విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంలో మూడు బార్లు సైతం రాత్రి రాత్రే ఓపెన్ చేసి స్టాక్ తరలించినట్లు లిక్కర్ వ్యాపారులే కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. మద్యం షాపులనుంచి స్టాక్ మాయం పై జిల్లా కలెక్టర్ స్పందించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 

 షాపుల్లో స్టాక్ రిజిస్టర్ , డిపో నుంచి ఎంత సరుకు వచ్చింది ..అనే లెక్కలు తీసి సీసీ పుటేజ్ లు సైతం తీసుకుంటే దొడ్డిదారి విక్రయాల వ్యవహారం బయటపడుతుంది. అయితే కొన్ని చోట్ల స్టాక్ రిజిస్టర్ లు సైతం పక్కగా మేయింటెన్ చేయలేదని తెలుస్తోంది. మరి లిక్కర్ దందాపై ఉన్నతాధికారులు ...ఏం చేస్తారో చూడాలి . 

మరింత సమాచారం తెలుసుకోండి: