ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. గత నెలరోజుల్లోనే దాదాపు 5వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ లోని మతపరమైన సమ్మేళనం లో పాల్గొన్న వారి కారణంగా ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని తెలుస్తుంది. అయితే ఈ మత ప్రార్థనలలో పాల్గొన్న వారి కారణంగా ఏ రాష్ట్రాలలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందో కింద తెలుసుకుందాం.

1. మహారాష్ట్ర

మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 2334 పాజిటివ్ కేసులు నమోదు కాగా... వాటిలో 217 రికవరీ కేసులు, 160 మరణాలు ఉన్నాయి.


2. ఢిల్లీ

భారత రాజధాని ఢిల్లీలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పటివరకూ 1510 పాజిటివ్ కేసులు నమోదు కాగా... వాటిలో 30 రికవరీ కేసులు.. 28 మరణాలు ఉన్నాయి.

3. తమిళనాడు

తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటి వరకు 1173 మంది కరోనా వైరస్ బారిన పడగా... వారిలో 58 మంది డిశ్చార్జ్ కాగా... 11 మంది మృత్యువాత పడ్డారు.

4. రాజస్థాన్

రాజస్థాన్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 873 మందికి కరోనా వైరస్ సోకగా... వారిలో 21 మంది పూర్తిగా కోలుకోగా... ముగ్గురు కోవిడ్ 19 వ్యాధికి ఆహుతయ్యారు.

5. మధ్య ప్రదేశ్

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 604 కేసులు నమోదు కాగా... వాటిలో 44 రికవరీ కేసులు... 43 మరణాలు ఉన్నాయి.

ఇకపోతే భారతదేశం మొత్తంలో ఇప్పటివరకు... 10363 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 1036 మంది వ్యాధి నుండి కోలుకోగా... 339 మంది మృత్యువాత పడ్డారు. తెలుగు రాష్ట్రాలు రెండు కలిపితే మొత్తం కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు 1000 దాటిందని, మరణాలు 20 పైగా నమోదయ్యాయని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: