ప్రపంచ దేశాలన్నిటి  ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ ఉంటుంది  ప్రపంచ ఆరోగ్య సంస్థ. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీప్ చైనా కి సపోర్ట్ చేస్తున్నారు అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ చైనా వత్తాసు పలుకుతూ  విపత్కర పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటూ అమెరికా విమర్శలు సైతం చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీప్ పై  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అటు ప్రపంచ దేశాలు కూడా పదే పదే విమర్శలు చేస్తున్నాయి.

 


 అయితే అమెరికా నుంచి 400 మిలియన్ డాలర్లు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ మాత్రం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీప్ రాజీనామా చేస్తే తప్ప ఈ సొమ్మును చెల్లించము అంటూ తేల్చి చెప్పింది. అయితే ప్రస్తుతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీప్ చైనాకు వత్తాసు పలుకుతున్నారు అనే విమర్శలు గత కొన్ని రోజుల నుంచి వస్తున్నాయి. చైనా చెబుతున్న లెక్కలన్నీ సరైనవేనని సర్టిఫై చేయడం... చైనా చెప్పినట్లుగా ఈ వైరస్ గబ్బిలాల  నుంచే వచ్చింది అంటూ చైనాకు వత్తాసు పలుకుతుండటం లాంటివి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీప్  చేస్తున్నారు. 

 

 అయితే కేవలం గబ్బిలాల నుంచి మాత్రమే ఈ వైరస్ వస్తే  ఇంత సీరియస్ గా ఉండేదికాదని  అందుకే చైనాలో ఈ వైరస్ పుట్టిన ప్రాంతం వరకు వెళ్లి పరిశోధన జరుపుతామని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైరాలజీ శాస్త్రవేత్తలు చెబుతుంటె.. అయితే దీనికి చైనా మాత్రం అంగీకరించడం లేదు వేరే ప్రపంచంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీప్ కూడా ఎక్కువ టెన్షన్ పడాల్సిన పనిలేదని చైనాకు వెళ్ళి పరిశోధనలు చేయాల్సిన అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించడం ప్రస్తుతం పలు విమర్శలకు తావిస్తోంది, దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీప్ పై ఒత్తిడి  ప్రపంచ దేశాలు ఈ రోజు రోజుకు పెరిగిపోతోంది.అయితే ఇంత జరుగుతున్నప్పటికీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీట్ మాత్రం రాజీనామా చేసేది లేదు అంటూ తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: