అధికార వైసీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేల్లో నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఒకరని విషయం తెలిసిందే. ఆమె చంద్రబాబు పేరు చెబితే చాలు ఒంటికాలు మీద వెళ్ళిపోతారు. ఇక టీడీపీలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కూడా ఫైర్ బ్రాండ్ నేతన్న సంగతి తెలిసిందే. ఇక రోజాకు, బోండాకు పెద్దగా పడదన్న విషయం కూడా తెలిసిందే. గత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఇద్దరు మధ్య అసెంబ్లీలో గానీ, బయట గానీ ఓ రేంజ్ లో మాటల యుద్ధం జరిగింది.

 

అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక వీరిద్దరు పెద్దగా విమర్సలు చేసుకున్న సందర్భాలు లేవు కానీ, తాజాగా మాత్రం బోండా, రోజా టార్గెట్ గా విమర్సలు చేశారు. ఇటీవల రోజా తన నియోజకవర్గంలో ఓ గ్రామంలో బోరుబావి వేయించి, దాని ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లారు. ఇక బోరుబావి వేసి తమ తాగునీటి సమస్యలు తీర్చినందుకు గాను, అక్కడి ప్రజలు, రోజా వచ్చే సమయంలో పూల వర్షం కురిపించారు.

 

ఇక ఇదే అంశంపై టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. కరోనా ప్రభావం ఇంతలా ఉంటే సామాజిక దూరం పాటించకుండా, ఇలాంటి టైంలో పూల వర్షం కురిపించుకోవడం ఏంటని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే బోండా ఉమా లైన్ లోకి రోజాపై ఇష్టారీతిలో విమర్సలు చేశారు. రోజా కరోనా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి. డ్యాన్సులు వేసుకుంటూ, పూలు జల్లుకుంటూ.. రూ. 2 లక్షలు ఖరీదు చేసే బోరు ప్రారంభోత్సవానికి వెళుతూ.. 200 మంది ప్రాణాలు పణంగా పెట్టారని, చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తికి నగరి ఎమ్మెల్యే రోజా కారణమని అర్థంపర్ధం లేకుండా మాట్లాడేశారు.

 

అసలు ఆమెకి తెలియకుండానే అక్కడి ప్రజలు పూలు జల్లారు. ఆమె సామాజిక దూరం పాటిస్తూ, అందరికీ నమస్కారం చేసుకుంటూ వెళితే, డ్యాన్సులు వేసుకుంటూ వెళ్ళారని సిగ్గులేకుండా అబద్దాలు మాట్లాడారు. పైగా చిత్తూరులో కరోనా వ్యాప్తికి రోజా కారణమంటూ దారుణమై వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా బోండా ఉమాకు ఓ మహిళ ఎమ్మెల్యే గురించి ఇలా మాట్లాడటం సరైన విధానం కాదు అనుకుంటా.

మరింత సమాచారం తెలుసుకోండి: