పాకిస్థాన్ దేశంలో పెట్రోల్ చాలా తక్కువ ధరకు లభించనుంది. పాకిస్థాన్ ప్రముఖ పత్రిక అయిన డాన్ కథనం ప్రకారం మే 1వ తేదీ నుండి భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు అమలులోకి వస్తాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ ముడి చమురు ధరలు దారుణంగా పడిపోయాయి. అందుకే పాకిస్తాన్ దేశం పెట్రోల్ ధరను లీటర్ కు 20 రూపాయలు తగ్గించాలని నిశ్చయించుకుంది. హై స్పీడ్ డీజిల్ ధర ఏకంగా రూ. 33.94 తగ్గించనున్నట్టు పాకిస్తాన్ ఆయిల్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ తెలిపింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లో చర్చించిన అనంతరం పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేందుకు సిద్ధమైందని డాన్ పత్రిక పేర్కొంది.


పాకిస్థాన్ దేశంలో పెట్రోల్, డీజిల్ చాలా ఎక్కువగా వినియోగించబడతాయి. ముఖ్యంగా ఈ ముడి చమురు వలనే పాకిస్తాన్ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగు పడుతూ ఉంటుంది. కానీ కోవిడ్ 19 కారణం గా అందరూ ఇళ్లకే పరిమితమవడం తో పెట్రోల్, డీసెల్ వినియోగం విపరీతంగా తగ్గిపోయింది. దాంతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు చిన్నాభిన్నమవుతుంది. మార్చ్ 25వ తేదీన 15 రూపాయలు తగ్గించి... ఈ తగ్గించిన ధర మూడు నెలల వరకు ఉండొచ్చని... లేకపోతే ముందు రోజుల్లో ఇంకా తగ్గవచ్చు అని పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే. ఇతర ఆయిల్స్ ఐన కిరోసిన్ తదితర ఉత్పత్తులపై 57% ధరలు తగ్గనున్నాయి అని అక్కడి ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది.


ముడిచమురు ధర తగ్గడానికి... కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందడం అని.. అమెరికా దేశంలో చమురు ధరలు నిర్విరామంగా తగ్గుతున్నాయి. ఎందుకంటే అక్కడ డిమాండ్ లేకపోవడం వల్ల కంపెనీలు ఎక్కువ చమురును నిల్వ చేయడంలో విఫలమవుతున్నాయి. ఇకపోతే పాకిస్తాన్ దేశంలో ఆర్థిక వ్యవస్థ మళ్లీ కుదుట పడేందుకు కరోనా బడ్జెట్ ని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: