ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నారు అని చెప్పాలి. ఈ తరుణంలోనే ఈ మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సిన్ వచ్చేంతవరకు ప్రజలు అందరు కూడా అప్రమత్తంగా ఉండాలి అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలియజేయడం జరిగింది. కొన్ని ప్రాంతాలలో నిబంధనలు సడలింపు చేయడం అంటే కరోనా వైరస్ పోయినట్లు కాదు అంటూ జగదీష్ తెలియజేశారు. అంతేకాకుండా కరోనా వైరస్ తగ్గు ముఖం పట్టి ఉంచేందుకు 3000 శానిటైజర్లతో పాటు 3000 మాస్క్ లను ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి అందజేయడం జరిగింది.

 

ఈ కార్యక్రమం మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ శానిటైజర్ తో పాటు మాస్క్ లను కూడా ధరించాలని సూచించడం జరిగింది. ఈ విపత్తు కాలంలో దాతలు ముందుకు రావడం ధైర్యాన్ని ఇస్తుంది అని కొనియాడారు. అటువంటి దాతృత్వాన్ని చాటుకున్న నేత నామా నాగేశ్వరరావు అని కొనియాడడం జరిగింది. అంతే కాకుండా ప్రభుత్వం పోలేని చోటుకు స్వచ్ఛంద సంస్థలు సహాయం చేయడం అభినందనీయం అని మంత్రి తెలియజేశారు. ఇక ప్రజలు ఏ ఒక్కరు కూడా రాష్ట్రంలో పస్తులు ఉండకూడదు అన్నది కేసీఆర్ లక్ష్యం అంటూ జగదీష్ రెడ్డి తెలిపారు.

 


నిజానికి చాల ప్రాంతాలలో కొన్ని సంఘాలు వారికి తోచినంతగా వారు పేదలకు సహాయం చేయడంతో నిజానికి ప్రభుత్వానికి ఒకింత సహకారంగా వారు నిలబడుతున్నారు. ఇవ్వన్నీ పక్కన పెడితే కొందరు మాత్రం మాకు ఏవి పట్టనట్టు రోడ్ల మీద విచ్చల విడిగిగా తిరుగుతున్నారు. ఇలాంటి వారు మారితే తప్ప దేశంలో కరోనా మహమ్మారి నశించదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: