దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విజృంభిస్తున్న తరుణంలో లాక్ డౌన్ విధానాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతూ ఉండడంతో ... ఇన్ని రోజులు మద్యం అమ్మకాలు జరగకుండా ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇలా ఉండగా కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో సడలింపులు చేయడంతో రెండు రోజుల నుంచి పలు రాష్ట్రాలలో మద్యం షాపులు విక్రయాలు చేపట్టాయి. ఇక దాదాపు 40 రోజులుగా మద్యం దొరక్క ఉన్నవారంతా ఎప్పుడెప్పుడు మద్యం సేవిస్తామా అన్న ఆత్రుతతో ఉన్నారు.

 


ఇక దానితో కొన్ని ప్రాంతాల్లో అయితే మద్యం దుకాణాల ముందు క్యూలు కడుతున్నారు అంటే నమ్మండి. ఇది ఇలా ఉండగా తాజాగా ఉత్తరాఖండ్ లో ఒక సంఘటన వాళ్ళ కమిట్మెంట్ తెలియజేస్తుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ ప్రాంతంలో ఒక మద్యం షాపు వద్ద భారీగా క్యూలైన్ ఉంది. అదే సమయంలో భారీగా ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురుస్తుంది అప్పటికీ కూడా మద్యం కొనుక్కోవడానికి వచ్చిన వారందరూ కూడా గొడుగులు పట్టుకొని మరీ క్యూలైన్ లో నిల్చొని మరికొందరు అయితే రెయిన్ ‌కోట్స్ ధరించుకొని క్యూలైన్ లో నించొని మద్యం కోసం వేచి ఉన్నారు.

 

 

మొదట్లో భారీగా వర్షం రావడంతో మద్యం షాపు యజమాని కస్టమర్లు అందరు కూడా తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్లి పోతారు అని అనుకున్నాడు. కానీ... భారీగా వర్షం కురిసినప్పటికీ కూడా మద్యం తీసుకెళ్లాలన్న పట్టుదలతో లైన్ లో ఉన్నవారు అంతా వెనక్కు తగ్గలేదు అనే చెప్పాలి. ఇక అంతే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ దుకాణం ముందు గీసిన సర్కిల్లో సహనంతో ఓపికగా నిల్చున్నారు. ఇది ఇలా ఉండగా వారి వంతు వచ్చాక.. మద్యం బాటిళ్లు వారి చేతికి ఇకవారి అనుభూతి చూస్తే బిత్తర పోతున్నారు షాపు యజమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: