ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి చాపకింద నీరులా విజృంభిస్తుంది. ఇక వైరస్ బారిన పడి మృత్యువాత పడిన వారందరినీ పలు దేశాలలో ఎక్కడపడితే అక్కడ వారిని పూడ్చి పెట్టడం కూడా చూశాము. మరికొన్ని దేశాలలో అయితే కరోనా సోకిన వారిని గన్ తో షూట్ చేసి చంపేయడం కూడా జరిగింది. ఇక ఈ మహమ్మారి తెచ్చిన భయంతో.. ఎవరైనా సర్వసాధారణంగా మరణించినా కూడా వారి అంతక్రియలు చేసేందుకు సొంత కుటుంబ సభ్యులే వెనకడుగు వేస్తున్నారు అంటే నమ్మండి.


ఇక ఇటీవల ఒక వ్యక్తి చనిపోతే వారి కుటుంబ సభ్యులు ఊరిబయట శవాన్ని పడేసిన సంఘటన కూడా చూసాము. ఈ తరుణంలోనే వృద్ధుడు దహన సంస్కారాలకు ఆ నలుగురు వార్డు వాలంటీర్లు చేశారంటే నమ్మండి. ఇక అసలు విషయానికి వస్తే... ఈ సంఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో చోటు చేసుకోవడం జరిగింది. ఇక నరసరావుపేటలోని 30వ వార్డు కు చెందిన షేక్ నన్నే బుజ్జి(75) అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. అనారోగ్యం తో మంచం పట్టిన వృద్ధుడు రెండు రోజుల క్రితం మృత్యువాత పడ్డాడు. 


నిజానికి అతనికి ఆరుగురు సంతానం. ఇక తండ్రి మరణవార్త వినగానే అందరూ కూడా హుటాహుటిన ఇంటికి వచ్చారు. తండ్రి ఉన్న ఏరియా రెడ్ జోన్ అవ్వడంతో తండ్రి అంత్యక్రియలు ఎలా జరపాలో అర్థం కాక కుమారులు ఇబ్బంది పడ్డారు. ఇక వారి సాంప్రదాయం ప్రకారం ఆ ప్రాంతంలోని మసీదుకు చెందిన వారిని పిలిచినా కరోనా వైరస్ భయంతో ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇక దీనితో పీపీఈ కిట్లు ధరించి వార్డు వాలంటరీలు దహన సంస్కారాలు చేసేందుకు ముందుకు వచ్చారు. మృతదేహానికి స్నానం చేయించి ... జాగ్రత్తగా ప్యాక్ చేశారు. ఆ మృతదేహాన్ని చిలకలూరిపేట రోడ్డులోని కబ్రిస్తాన్‌ కు చేర్చడం జరిగింది. ఈ మొత్తం కార్యక్రమాన్ని మాజీ కౌన్సిలర్, సచివాలయ శానిటేషన్‌ సెక్రటరీ, ANM లు దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. ఇక ఏది ఏమైనా వాలంటీర్లు చేసిన పనికి అక్కడ ఉన్న స్థానికులు అందరూ కూడా మెచ్చుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: