విశాఖలో ఎల్జీ  పోలిమెర్స్  గ్యాస్ లీకేజీ ఘటన  ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎల్జి పాలిమర్స్ అనే ప్లాస్టిక్ తయారీ కంపెనీ నుంచి భారీ మొత్తంలో తెల్లవారుజామున గ్యాస్ లీకేజీ కావడంతో చుట్టుపక్కల రెండు మూడు గ్రామాల ప్రజలు అందరూ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ కొంత మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. అయితే అది  గ్యాస్ కాదని కేవలం ఆవిరి మాత్రమే ప్రమాదవశాత్తు సిస్టం ప్రాబ్లం రావడం వల్ల విడుదలైంది. ఆ ఆవిరితో కొన్ని  రసాయనాలను కలపడం ద్వారా విషవాయువుల మారిపోయింది అని వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. 

 


 అటు నిపుణులు కూడా ఈ అంశాన్ని తేల్చారు. అయితే ఈ విషవాయువు ఎంత పెద్ద ఎత్తున నాశనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కొంతమంది ప్రజల ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఎన్నో మూగ జీవాలు కూడా ప్రాణాలు కోల్పోయాయి.  ఇక అక్కడ పచ్చగడ్డి కూడా నాశనం  అయిపోయింది. ఈ నేపథ్యంలో ఎల్జి పాలిమర్స్ కంపెనీని విశాఖ నుండి తరలించాలి  ఉంది అంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 

 


 అయితే ఇది కొరియన్ కంపెని  కావడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఎందుకంటే ప్రస్తుతం విదేశాలకు చెందిన కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కు  ఆహ్వానిస్తూన్న  నేపథ్యంలో దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ తరలిస్తే.. ఎలాంటి సమస్య వచ్చి పడుతుందో అనే చర్చ మొదలైంది. అయినప్పటికీ ప్రజల సంక్షేమం దృష్ట్యా నిర్మొహమాటంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. ఇప్పటివరకు ఎల్జి పాలిమర్స్ కంపెనీలో ఉన్న గ్యాస్ మొత్తం వెనక్కి పంపించింది  ప్రభుత్వం. కాగా దీనిపై ప్రభుత్వం తదుపరి ఎలాంటి  చర్యలు తీసుకోబోతున్నారు అన్నది తెలియాల్సి ఉంది.అయితే ఇప్పటికే ప్లాస్టిక్ తయారీ కంపెనీ ఎల్జి పాలిమర్స్ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: