ప్రస్తుతం నిత్యావసరాల్లో  ఒక భాగంగా మారిపోయింది మాస్క్ . కరోనా  వైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి అందరు మాస్క్ లతోనే  దర్శనమిస్తున్నారు. అంతేకాకుండా కరోనా  వైరస్ మహమ్మారిని నియంత్రించడంలో మాస్క్ ఎంత  కీలక పాత్ర పోషిస్తుంది  అన్నది ప్రస్తుతం ప్రత్యేకంగా చెప్పాల్సి పనిలేదు.  అందుకే ప్రపంచ దేశాల ప్రజలందరూ ప్రస్తుతం ఎక్కడ చూసినా మాస్క్ లతో దర్శనమన్నారు. ఇక ఎవరైన మాస్కులు ధరించకపోతే అటు  అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. మామూలుగా అయితే మహమ్మారి వైరస్ నుంచి తప్పించుకోవడానికి అందరూ మాస్కూలు  వాడుతున్నారు. 

 

 

 కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం మాస్క్  పెట్టుకుని ఏకంగా తన ఐడెంటిటీని మార్చుకున్నాడు. పోలీస్ స్టేషన్ నుంచి బయటపడ్డాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. యూఎస్ లోని ఇలినాయిస్  కుక్  కౌంటీ  జైల్లో  28వేల హేండర్సన్ 21 ఏళ్ల ష్కాట్  అనే ఇద్దరు వ్యక్తులు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే హేండర్సన్  శిక్షాకాలం పూర్తికావడంతో అతనిని  విడుదల చేసేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే హేండర్సన్ తన స్థానంలో మరొకరిని బయటకు పంపించాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలో స్కాట్  తో తన వ్యక్తిగత వివరాలను చెప్పి 1000 డాలర్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

 

 

 అయితే ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఖైదీల అందరూ మాస్కులూ ధరించాలి అని ఒక నిబంధన ఉన్న విషయం తెలిసిందే. కాగా మాస్కు ధరించి హేండర్సన్ స్థానంలో స్కాట్  జైలు అధికారుల ముందుకు వెళ్ళాడు. జైలు అధికారులు స్కాట్ నే అండర్సన్ గా భావించారు. అటు  స్కాట్ కూడా హేండర్సన్  సంబంధించిన వివరాలన్నీ చెప్పడంతో అతనిని విడుదల చేశారు. ఆ తర్వాత వారం తర్వాత అసలు విషయం బయటపడడంతో మరోసారి స్కాట్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. కాగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం సహా చట్టవిరుద్ధంగా ఆయుధాలను కలిగి ఉన్న కేసులో స్కాట్  జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అటు హేండర్సన్  పై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: