ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భౌతిక దూరం పాటిస్తూ బస్సు సర్వీసులను నడపాలని నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ బస్సు సర్వీసులు నడిపేందుకు విధివిధానాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూ ఉండటం... లాక్ డౌన్ గురించి అధికారులు, మంత్రులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఏపీ సర్కార్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి బస్సులు నడపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
దశల వారీగా బస్సుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం బస్టాండ్ నుంచి బస్టాండ్ కు మాత్రమే బస్సులు నడపాలని ప్రభుత్వం భావిస్తోంది. బస్టాండ్ మినహా ప్రయాణికులను ఎక్కించుకోవడం, దింపడం చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం బస్సులో ప్రయాణించే ప్రయాణికుల పూర్తి వివరాలను సేకరించనుందని తెలుస్తోంది. 
 
బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. ప్రయాణికులు బస్సుల్లో భౌతిక దూరం పాటించేందుకు సగం సీట్లతోనే బస్సులు నడపాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ బస్సులతో పాటు రాష్ట్రంలో తిరిగే బస్సులపై ప్రభుత్వం మరో మూడు నాలుగు రోజుల్లో విధివిధానాలు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం బస్సుల్లో 20 మందికి మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది. 
 
ప్రభుత్వం బస్సులకు అనుమతులు ఇచ్చినా బస్సులు రోడ్డెక్కటానికి నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు బస్సులు నడిపేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది. మరోవైపు రాష్ట్రంలో కేంద్రం సడలింపుల ప్రకారం లాక్ డౌన్ నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 52 కేసులు నమోదు కావడంతో కరోనా కేసుల సంఖ్య 2282కు చేరింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: