దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కరోనా ధాటికి పతనమవుతున్నాయి. దేశంలోని అన్ని రంగాలు కరోనా విజృంభణ వల్ల లాక్ డౌన్ ప్రకటించడంతో కుదేలయ్యాయి. కేంద్రం మూడో విడత లాక్ డౌన్ లో దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మందుబాబులు మద్యం దుకాణాల దగ్గర క్యూ లైన్లలో నిలబడి మద్యం కొనుగోలు చేస్తున్నారు. 
 
అయితే మద్యం తాగే వారు కరోనా భారీన పడే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. మద్యపానం వ్యాధి ప్రభావాన్ని తీవ్రం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. మద్యపానం శ్వాసకోశ వ్యవస్థలో వైరల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా ఎక్కువయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణంగా మద్యం ఎక్కువగా సేవించేవారిలో ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయని ఇటలీకి చెందిన పరిశోధకుడు టెస్టినో చెబుతున్నారు. 
 
సాధారణంగా ఆల్కహాల్ మెదడులోని కొన్ని నాడీ ప్రసారాలపై ప్రభావం చూపుతుంది. నాడీ కణాల చర్యలను తగ్గిస్తుంది. చాలామంది మద్యం సేవిస్తే ఒత్తిడి తగ్గుతుందని భావిస్తారు. కానీ మద్యం సేవిస్తే ఒత్తిడి మరింత పెరుగుతుందని న్యూ సౌత్ వేల్స్ పరిశోధకుడు మైఖేల్ మీడియాకు తెలిపారు. మరోవైపు లాక్ డౌన్ వల్ల పలు దేశాల్లో మద్యం విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి.       
 
మన దేశంలో కూడా మద్యం కొనుగోళ్లు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. చాలామందికి మద్యం తాగడం వల్ల ఆ క్షణం ఎంతో హాయిగా అనిపిస్తుంది. రక్తంలో ఆల్కహాల్ లెవెల్స్ పెరుగుతాయి. మద్యం తాగిన వెంటనే మెదడు విశ్రాంతి పొందుతున్నట్టు అనిపిస్తుంది. లాక్ డౌన్ వల్ల పలు దేశాల్లో మద్యం దుకాణాలను బంద్ చేసినా వినియోగం తగ్గలేదని నివేదికలు చెబుతున్నాయి. రోగనిరోధక శక్తికి ఆల్కహాల్ విషంలాంటిది. ఆల్కహాల్ కరోనా వైరస్ ను నిరోధించలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: