కొంతమంది చిన్నచిన్న మనస్పర్థలకు, లేక ఏదో పాత విషయాలను గుర్తు తెచ్చుకోని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు అలాంటి సంఘటన ఒకటి హైదరాబాద్ పాతబస్తీలో నవవధువు చేసుకుంది. ఇక అసలు విషయంలోకి వెళితే... 


కొత్తగా పెళ్లి అయిన మూడు రోజులకే లాక్ డౌన్ మొదలవడంతో ఆవిడ తన భర్తకి దూరంగా ఉండవలసిన అవసరం వచ్చింది. దీనితో ఆవిడ పూర్తిగా మనస్తాపం చెందింది. ఈ సంఘటన హైదరాబాదులోని పాతబస్తీలో జరిగింది. ఉప్పుగూడకు చెందిన మోహన్ కుమార్ కుమార్తె వనజ వరంగల్ కు చెందిన అనిల్ కుమార్ అనే యువకుడితో మార్చి 19న ఘనంగా వివాహం జరిగింది. అయితే ఆ తర్వాత మూడు రోజులకే మార్చి 22న లాక్ డౌన్ మొదలైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనితో వనజ అత్తారింటికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీనితో ఆవిడ తీవ్ర మనస్థాపానికి లోనయ్యింది. 


ఈవిషయంలో తనను కాపురానికి తీసుకువెళ్లాలని భర్తను అనేకమార్లు వనజ కోరింది. ఇక కాకపోతే రవాణా సౌకర్యం సరిగా లేకపోవడంతో లాక్ డౌన్ ముగిసిన వెంటనే తనని సంప్రదాయబద్ధంగా ఇంటికి తీసుకు వెళ్తామని అత్తమామలు పలుమార్లు చెప్పడం జరిగింది. ఇది ఒక వైపు ఉండగా మరో సైడ్ అనిల్ రేడు, మూడు సార్లు తన బైక్ పై వరంగల్ నుండి హైదరాబాద్ కు వచ్చి వెళ్లడం జరిగింది. తన భార్యను చూడడానికి ఎంతో శ్రమించి వరంగల్ నుంచి హైదరాబాదుకు వచ్చి చూసి పోతున్న గాని తీవ్ర మనస్థాపానికి గురి అవ్వడం జరిగింది. 


ఇక ఇదే నేపథ్యంలో మంగళవారం నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో వనజ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి ఆమెను తరలించిన మార్గమధ్యంలోనే చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఛత్రినాక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు. కేవలం పెళ్లి అయిన రెండు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడంతో అటు తల్లిదండ్రుల కుటుంబంలో, ఇటు అత్తమామల కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిలించింది వనజ.

మరింత సమాచారం తెలుసుకోండి: