కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. 2014 - 2019 ఐదేళ్ల పాలనలో ప్రధానిగా ప్రజల మెప్పు పొందడంలో మోదీ సఫలమయ్యారు. నోట్లరద్దు లాంటి నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడినా విజన్ ఉన్న నాయకుడిగా, సమర్థవంతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల్లో మోదీ రెండోసారి కూడా కేంద్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చి మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 
 
సింగిల్ మెజారిటీతో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో జాతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు భారీ షాక్ తగిలింది. అయితే అప్పటి పాలనకు ఇప్పటి పాలనకు మోదీ చాలా మారారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2014లో ఉన్న సంక్షోభాలను తగ్గిస్తూ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా మోదీ ముందుకెళ్లారు. జన్ ధన్ యోజన, స్వచ్ఛ భారత్, ముద్ర యోజన, సౌభాగ్య యోజన, ఉజ్వల్ బీమా, ఫసల్ యోజన, జీఎస్టీ, నోట్లరద్దు ఈ.డబ్ల్యూ.ఎస్ రిజర్వేషన్లు, కిసాన్ నిధి, జాతీయ రహదారులు ఇలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 
 
2019లో అధికారంలోకి వచ్చిన తరువాత సుదీర్ఘ కాలం నుంచి దేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై మోదీ ప్రధానంగా దృష్టి పెట్టారు. ఆర్టికల్ 370 రద్దు, పోస్కో చట్టం బిల్లు, కార్మిక భద్రత బిల్లు, మెట్రో ప్రాజెక్టులు, మెగా సౌర ప్రాజెక్టులు,మెగా హైడ్రో ప్రాజెక్టులు, హర్ ఘర్ జల్, ట్రిపుల్ తలాఖ్ బిల్ల్, ఎన్నార్సీ లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మోదీ తీసుకున్న నిర్ణయాలకు కొందరు మద్దతు పలుకుతుంటే మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. 
 
అయితే రెండోసారి అధికారంలోకి బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత పలు రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో మెజారిటీ స్థానాలు సాధిస్తున్నా ఇతర పార్టీలు పొత్తులతో అధికారాన్ని కైవసం చేసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దీంతో రాజకీయ విశ్లేషకులు బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందా..? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: