ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. చంద్రబాబు వైజాగ్ వెళ్లేందుకు ఏపీ డీజీపీని అనుమతి కోరగా నిన్న అనుమతి లభించింది. చంద్రబాబు విమానంలో హైదరాబాద్ నుంచి విశాఖ రావాలని భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా నిన్న రాత్రి విశాఖ, విజయవాడ నగరాల నుంచి విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటన వెలువడింది. 
 
ఈ ప్రకటనతో షాక్ అవ్వడం బాబు వంతయింది. ఈ ప్రకటనతో టీడీపీ నేతలు కూడా గందరగోళానికి గురయ్యారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రతీకార ధోరణి నడుస్తోంది. చంద్రబాబు ప్రతిపక్షనాయకుడిగా రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి రాజకీయ ధోరణి పెద్దగా లేదు. గత ఐదేళ్లలో చంద్రబబు జగన్ కు ప్రతి విషయంలో వ్యతిరేకంగా వ్యవహరించారు. 
 
వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కోవడం, వైసీపీ నేతలపై దాడులు, సీఎం జగన్ కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వకపోవడం జరిగింది. చంద్రబాబు చేసిన తప్పులే ఒక రకంగా జగన్ కు ప్లస్ అయ్యాయి. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిపై జగన్ ప్రతీకారం తీర్చుకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు విశాఖకు అనుమతి కోరగా కుడి చేతితో అనుమతులు ఇచ్చి ఎడమచేత్తో లాక్కుంటున్నరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఏపీ ప్రభుత్వం మంగళవారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభిస్తామని చెప్పి కేంద్రాన్ని అనుమతి కోరడం... కేంద్రం అనుమతులు ఇవ్వడం చకచకా జరిగింది. చంద్రబాబు చివరకు ఏం చేయాలో అర్థం కాక కారులో అమరావతి చేరుకున్నారు. ప్రతిపక్షం విశాఖలో రాజకీయం చేద్దామని భావిస్తే అధికారపక్షం రాజకీయం చేసి ప్రతిపక్షాన్ని దెబ్బ కొట్టింది. అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చి జగన్ సర్కార్ బాబుకు దిమ్మతిరిగే షాకులు ఇచ్చింది.                               

మరింత సమాచారం తెలుసుకోండి: