మామూలుగా ఎవరైనా సామాన్యుల  ఇంట్లో దొంగతనం జరిగింది అంటే... అది పోలీసులకు సవాల్గా మారిపోతుంది అనే విషయం తెలిసిందే. అదే ఒక సెలబ్రిటీ ఇంట్లో దొంగతనం జరిగితే... అది మరింత వైరల్  గా మారిపోతుంది. తాజాగా అలాంటి ఘటనే జరిగింది ఇక్కడ. టీమిండియా మాజీ క్రికెటర్ బిజెపి ఎంపీ అయిన గౌతం గంభీర్ ఇంట్లో చోరీ జరిగింది. గౌతం గంభీర్ తండ్రి కారు చోరీకి గురైంది. ఇంటి ఆవరణలోని తన తండ్రి కారు దొంగతనానికి గురి అయిందని గౌతం గంబీర్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారిపోయింది. బిజెపి ఎంపీ గా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఇంట్లో చోరీ  ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. ఇక ఈ విషయాన్ని పోలీసులు కూడా సవాలుగా తీసుకొని ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు. 

 

 ఢిల్లీ సెంట్రల్ డిసిపి ఆధ్వర్యంలో పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి... ఈ కారు ఆచూకీ సహా  దొంగలను పట్టుకునేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు. అంతే కాకుండా చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలించగా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ తన తండ్రితో కలిసి రాజేంద్రనగర్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఢిల్లీలో ప్రముఖుల ఇళ్లే  లక్ష్యంగా దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు . గతంలో ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారు  సైతం దొంగలించడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 

 


 అప్పట్లో ఏకంగా ముఖ్యమంత్రి కారు చోరి కి గురికావడం ఢిల్లీ రాజకీయాల్లో సంచలనం గా మారిపోయింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు చెందిన బ్లూ కలర్ వాగనార్  కారు చోరీకి గురవడం పై ఆశ్చర్యానికి గురైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. చోరీకి గురైన కారు తో తనకు ప్రత్యేక అనుబంధం ఉంది అంటూ తెలిపారు. ఇక ఆ తర్వాత సీఎం కారు చోరి విషయంలో ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు కారు,  దొంగలను కారును పట్టుకున్నారు. ప్రస్తుతం బిజెపి ఎంపీ మాజీ క్రికెటర్ కారు చోరి కి గురికావడం సంచలనంగా మారిపోయింది. అయితే ఇలా ప్రముఖులకు చెందిన కార్లు చోరీకి గురికావడంతో పోలీసులపై పలు విమర్శలకు కూడా దారితీస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: