ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏదో ఒక అంశం హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి... పార్టీ ఫిరాయింపులకు  అయితే తావు లేదు కానీ.. పార్టీలో చేరకుండానే ఎంతో మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కారణం జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి రాగానే.. పార్టీ ఫిరాయింపుల కు తమ ప్రభుత్వ హయాంలో తావులేదని.. ఒకవేళ తమ పార్టీ లోకి రావాలి అనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత నే రావడానికి వీలు ఉంటుంది అంటూ  జగన్ సర్కార్ మొదట ఒక నిబంధన పెట్టడంతో ప్రస్తుతం అదే నిబంధన కొనసాగుతోంది. 

 


 ఒకవేళ జగన్ సర్కార్ ఈ నిబంధన గనుక పెట్టక పోయుంటే.. ఇప్పటికే వైసీపీ పార్టీలోకి టిడిపి నేతలు అందరూ క్యూ కట్టేవారు అన్న ఒక బలమైన వాదన కూడా ఎప్పుడూ వైసిపి పార్టీని వినిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీ మార్పు కు సంబంధించిన అంశం చర్చనీయాంశంగా మారింది. టిడిపి పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు వైసిపి పార్టీ వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని కానీ వారిని పార్టీ నుంచి విడిపోకుండా ఉండేలా చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నారు అంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. 

 


 పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలను పార్టీని వీడొద్దు అని  చెబుతుంటే ఎన్నికల్లో ఎంతో  ఖర్చు పెట్టామని అందుకే అధికార పార్టీ వైపు వెళ్లాల్సి వస్తుందని  కారణాలు చెబుతున్నారట టిడిపి ఎమ్మెల్యేలు. దీంతో కొంత మొత్తాన్ని తాను  సర్దుబాటు చేస్తాను అంటూ  చంద్రబాబు హామీ ఇస్తున్నారట. ఈ క్రమంలోనే 25 నుంచి ఏకంగా 50 కోట్ల మధ్య  సదరు ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు కూడా చంద్రబాబు ముందుకు వస్తున్నారట . దీనికి సంబంధించి అధికార వైసీపీ పార్టీ ప్రచారం చేస్తోంది. అయితే నిజంగానే 10 మంది ఎమ్మెల్యేలు వస్తానని రాకపోవడం వల్ల ఇలా ప్రచారం చేస్తున్నదా  లేకపోతే ఇది నిజమా అన్న దానిపై మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. అయితే మహానాడు విషయంలో ఇబ్బందులు కలుగ చేయాలని భావించిన వైసీపీ సరిగా అది కుదరక పోవడంతో ఇలా ప్రచారం చేస్తుందని  మరి కొంత మంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: