ఇదేంటి.. మహేశ్ మూవీని జగన్ ఫ్యాన్స్ వాడేసుకోవడం ఏంటి అనుకుంటున్నారా..ఇదో ఇంట్రస్టింగ్ కథ.. ఆ మధ్య మహేశ్ భరత్ అనే నేను.. అనే సినిమా తీశాడు గుర్తుంది కదా.. అందులో మహేశ్ బాబు.. అనూహ్యంగా సీఎం అవుతాడు. ఆ తర్వాత ప్రజల బాగు కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాడు. ప్రధానంగా గ్రామాల్లోని పరిస్థితులు మార్చాలని ప్రయత్నిస్తాడు. గ్రామ స్వరాజ్యం అనే కాన్సెప్టు తీసుకొస్తాడు.

 

 

అయితే ఇప్పుడు సీఎం జగన్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. గ్రామాల నుంచే అభివృద్ధి ప్రారంభంకావాలని ప్రయత్నిస్తున్నాడు. గ్రామాలే లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నాడు. అందులో భాగంగానే గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ వంటి వాటికి ప్రాణం పోశాడు. ఇప్పుడు కొత్త గా రైతు భరోసా కేంద్రాలు కూడా తీసుకొచ్చాడు. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అందుకే ఇప్పుడు జగన్ అభిమానులు.. జగన్ కార్యక్రమాల ప్రచారం కోసం మహేశ్ మూవీ భరత్ అనే నేను మూవీని వాడేసుకుంటున్నారు.

 

 

భరత్ అనే మూవీలోని మ్యూజిక్, డైలాగులు, సీన్స్ ను జగన్ తో పేరడీ చేసి సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేస్తున్నాయి. అవి సరిగ్గా సరిపోయి బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోలు, టిక్ టాక్ లు చూస్తే భలే ముచ్చటేస్తుంది. భరత్ అనే నేను మూవీలో మహేశ్ బాబు పాత్ర అచ్చం జగన్ పాత్రలా ఉందే అనే ఫీలింగ్ తీసుకొచ్చేలా ఈ వీడియోలు, టిక్ టాక్ వీడియోలు ఉంటున్నాయి.

 

 

అలా చూసేవారికి జగన్ అంటే ఓ హీరో వర్షిప్ వచ్చేలా ఈ వీడియోలు రూపొందిస్తున్నారు. అంటే మహేశ్ బాబు సినిమాను జగన్ ఫ్యాన్స్ తెగ వాడేసుకుంటున్నారన్నమాట. ఇటీవలి కాలంలో సమీక్ష సమావేశాల్లో జగన్ చేసిన ప్రసంగాల వీడియోలను ఈ సినిమా ఆడియో, విజువల్స్ తో మిక్స్ చేసి జగన్ ఫ్యాన్స్ అద్భుతాలే క్రియేట్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: