తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు అరెస్ట్ ను మరవక ముందే ఈరోజు ఉదయం టీడీపీకి మరో భారీ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం పోలీసులు ఈరోజు ఉదయం జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అనంతపురంకు తరలించారు. 
 
154 బస్సులు నకిలీ NOC, ఫేక్ ఇన్స్యూరెన్స్ కేసులో వీరిని అరెస్ట్ చేశారు. బీఎస్ 3 వాహనాల విషయంలో కూడా వీరిపై గతంలో ఆరోపణలు కూడా వచ్చాయి. వీటి విషయంలో కూడా గతంలో కేసులు నమోదయ్యాయి. ఒకే నకిలీ ఇన్స్యూరెన్స్ పాలసీని నాలుగైదు వాహనాలకు చూపినట్లు..... జఠాధర, గోపాల్ రెడ్డి కంపెనీల పేర్లతో అశోక్ లేలాండ్ స్క్రాప్ అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి. నిజానికి 2004కు ముందు చంద్రబాబు టీడీపీ నేతల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించేవారు. 
 
కానీ పదేళ్లు అధికారానికి దూరం కావడం.... ఇతర పార్టీలు కార్యకర్తలకు, నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడంతో 2014లో చంద్రబాబు కూడా నాయకులు, కార్యకర్తలు అవినీతికి పాల్పడుతున్నా.... ఆ విషయం తన దృష్టికి వచ్చినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. దాని పర్యావసానమే 2019లొ టీడీపీ ఘోర పరాజయానికి కారణమైంది. 175 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 23 స్థానాల్లో గెలవడానికి కూడా అదే కారణం. 
 
జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ తో సీమ టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. సీమలో రాజకీయంగా పలుకుబడి, పేరుప్రఖ్యాతలు ఉన్న జేసీ కుటుంబం విషయంలో సీఎం కఠినంగా వ్యవహరిస్తూ ఉండటంతో మిగతా టీడీపీ నేతలకు వణుకు పుడుతోంది. మరోవైపు కక్షపూరితంగా వ్యవహరించకుండా వైసీపీ నిజమైన కేసుల్లోనే టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తూ ఉండటంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: