రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రాజధానిగా ఉన్న అమరావతిని శాసనరాజధానిగా చేసి, విశాఖపట్నంని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ నిర్ణయం అమలు దిశగా జగన్ వెళుతుంటే, దానికి చంద్రబాబు అడ్డుపడుతున్న సంగతి తెలిసిందే. అటు అమరావతి రైతులు కూడా తమకు అన్యాయం చేయొద్దని ఎప్పటి నుంచో ఆందోళనలు చేస్తున్నారు.

 

ఎవరికి అన్యాయం జరగకుండానే మూడు రాజధానులు ఏర్పాటు జరుగుతుందని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. అయితే మూడు రాజధానులకు సంబంధించిన ప్రక్రియని మండలి పరిధిలో టీడీపీ అడ్డుకుంది. అటు దీనిపై కోర్టులో కూడా కేసులు వేసి మూడు రాజధానుల ప్రక్రియని అడ్డుకునేందుకు చూస్తోంది. టీడీపీ ఎంత అడ్డుకున్న జగన్ ఖచ్చితంగా మూడు రాజధానులని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రక్రియ ఓ కొలిక్కి రావోచ్చు.

 

అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. మూడు రాజధానులు ఏర్పాటైతే అన్నీ ప్రాంతాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తే పరిస్తితి ఏంటని విశాఖ ప్రజలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన అధికారంలోకి వస్తే మళ్ళీ రాజధానిని తరలించుకుపోతారేమో అని ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే రాజధాని వస్తుందని విశాఖ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. వారి ఆశలని జగన్ ఎలాగైనా తీరుస్తారు.

 

కాకపోతే వచ్చే ఎన్నికల నాటికి పరిస్తితి మారితే విశాఖ ప్రజలు ఇబ్బంది పడే అవకాశముంది. కానీ జగన్ ఆ పరిస్థితి రానిచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే నెక్స్ట్ కూడా జగన్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వైఎస్సార్ లాగా ఆయన సంక్షేమ పథకాల అమలులో కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. పథకాల అందుకుంటున్న ప్రతిఒక్కరూ జగన్‌ పట్ల పాజిటివ్ గా ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ కూడా సీఎం పీఠం జగన్‌కే దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ ఐదేళ్లు కూడా జగన్ పాలన ఉంటే, ఎక్కువ శాతం విశాఖ రాజధానిగా సెట్ అయిపోతుంది. ఆ తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా...రాజధాని మార్చడం అంత సులువు కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: