సమకాలీన రాజకీయ నాయకుల్లో కేసీఆర్ అంతటి నాయకుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడన్న విషయాన్ని చాలా మంది అంగీకరిస్తారు. ఆయన ప్రజానాయకుడు.. జనం నాడి తెలిసినవాడు. అందుకే జనం మూడ్ ను ఎప్పటి కప్పుడు గమనిస్తుంటాడు.. ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే తప్పు దిద్దేసుకుంటాడు. అబ్బే మనం నిన్నటి వరకూ ఇలా అన్నాం.. ఇప్పుడు మాట మారిస్తే ఎలా అనుకోడు..

 

 

జనం మూడ్ కు వ్యతిరేకంగా వెళ్లకపోవడం కేసీఆర్ గొప్పదనం.. ఆ మధ్య ఆర్టీసీ సమ్మె విషయంలో ఈ వాస్తవం మరోసారి రుజువైంది.. దాదాపు రెండు నెలలపాటు సమ్మె చేసినా కేసీఆర్ ఏమాత్రం కరగలేదు.. అసలు ఆర్టీసీయే ఉండదు.. అంటూ భయపెట్టేశాడు.. ఆ తర్వాత ఒక్కసారిగా రూట్ మార్చేశాడు.. ఆర్టీసీ ఉద్యోగులపై వరాల వర్షం కురిపించేశాడు.. బాప్ రే.. కేసీఆర్ మామూలోడు కాదు కదా అనిపించాడు.

 

IHG

 

తాజాగా చైనా సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన సంతోష్ కుటుంబం విషయంలోనూ మరోసారి ఇదే జరిగింది. కర్నల్ సంతోష్.. తెలుగు జాతి గర్వపడే పేరు.. దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలు వదిలిన మన తెలుగు తేజం.. తెలంగాణ ముద్దుబిడ్డ.. కానీ ఎందుకనో కేసీఆర్ కనీసం సంతోష్ పార్థివ దేహాన్ని సందర్శించలేదు. నివాళులు అర్పించలేదు.. ఆయన తల్లిదండ్రులను ఓదార్చలేదు..

 

 

దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. చాలా మంది జర్నలిస్టులు దీన్ని తమ తమ వేదికలపై విమర్శించారు. దాంతో కేసీఆర్ ఒక్క రోజులోనే తప్పు దిద్దుకున్నాడు. సంతోష్ కుటుంబానికి రూ. 5 కోట్ల నగదు సాయం ప్రకటించేశాడు. అంతే కాదు.. ఆయన భార్యకు గ్రూపు-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని ప్రకటించారు. అలాగే ఓ ఇంటిస్థలం కూడా ఇస్తామన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: